Medak: ఆస్పత్రి ఖర్చులు ఎక్కువయ్యాయని అల్లుడితో కలిసి భర్తను చంపిన మహిళ
మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అల్లుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. పొలం పనికి వెళ్లిన భర్త ..

Karrela Ashaiya
Medak District: మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అల్లుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. పొలం పనికి వెళ్లిన భర్త కిందపడగా.. నడుము, కాలుకు గాయమైంది. నడవలేని స్థితిలో ఉన్న అతడు ఏపని చేయలేడని భావించిన భార్య.. అల్లుడితో కలిసి భర్తను హత్య చేసింది. అయితే, అంత్యక్రియల సమయంలో భర్త తరపు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆందోళనకు దిగగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయగా.. గొంతు నులిమి భార్య హత్య చేసిందని తేల్చారు.
Also Read: మన భారతీయులను విమానంలో ఎంత ఘోరాతి ఘోరంగా హింసించారో తెలుసా? వారి మాటల్లోనే..
అల్లుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం బాచారం గ్రామంలో చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రెల ఆశయ్య (45) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈనెల 15వ తేదీన పొలం వద్దకు వెళ్లిన ఆశయ్య కిందపడటంతో కాలుకు, నడుముకు గాయాలయ్యాయి. దీంతో అతను కొంతకాలం మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో భర్తకు సేవలు చేస్తూ అండగా ఉండాల్సిన అతని భార్య శివమ్మ దారుణంగా ఆలోచించింది. భర్తను ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్య ఖర్చులకోసం భారీమొత్తాన్ని వెచ్చించాల్సి వస్తుందని భావించిన శివమ్మ తన అల్లుడితో కలిసి భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది.
Also Read: Amitabh Bachchans Son In Law : అమితాబ్ బచ్చన్ అల్లుడి మీద చీటింగ్ కేసు..
శివమ్మ అనుకున్న ప్రకారం అల్లుడు రమేశ్ తో కలిసి ఆదివారం అర్ధరాత్రి టవల్ తో తన భర్తను గొంతు నులిమి చంపేసింది. అంత్యక్రియల సమయంలో బంధువులు ఆశయ్య మెడపై గాయాన్ని గుర్తించారు. దీంతో శివమ్మను నిలదీయగా అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఆశయ్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.