RTO Inspections : బైకులు, కార్లు మీద వెళ్లే వాళ్లకు బిగ్ అలెర్ట్.. RTO తనిఖీలు.. మీ దగ్గర ఈ పేపర్స్ లేకపోతే..
RTO Inspections : కర్నూల్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటన నేపథ్యంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రతి ప్రైవేట్ బస్సును ఆర్టీఏ
RTO Inspections
RTO Inspections : కర్నూల్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనతో రవాణాశాఖ అప్రమత్తమైంది. రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఇతర వాహనాలను తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా ఝుళిపిస్తున్నారు.
శుక్రవారం తెల్లవారు జామున కర్నూల్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటన నేపథ్యంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రతి ప్రైవేట్ బస్సును ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సరైన పత్రాలు లేని, నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేయడంతోపాటు.. సీజ్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు 50 బస్సుల్లో అధికారులు తనిఖీ చేపట్టారు. బండ్లగూడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఆర్టీఏ అధికారులు చలానాలు విధించారు.
కూకట్‌పల్లి ప్రాంతంలోనూ ఆర్టీవో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాలను, క్యాబ్‌లను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇన్సూరెన్స్, లైసెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రత్యేకంగా ట్రావెల్స్ వాహనాలపై అధికారులు దృష్టి సారించారు.
భద్రత దృష్ట్యా సీటు బెల్టులు, అత్యవసర ద్వారాలు, అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేస్తున్నారు. వాహనదారులు ట్రాపిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
విజయవాడ హైవే, బెంగళూరు హైవేపై ఆర్టీఏ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద సోదాలు చేశారు. ఏపీ నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేశారు. ఈక్రమంలో నిబంధనలు పాటించని ఐదు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సు అద్దం పగిలినా అలాగే నడుపుతున్న ట్రావెల్స్ బస్సును అధికారులు సీజ్ చేశారు.
ఎల్బీ నగర్ లోని చింతలకుంట వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రవెల్స్ బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న మరో నాలుగు బస్సులపై కేసులు నమోదు చేశారు.
