Renuka Chowdhury : రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ది : రేణుకా చౌదరి
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్లాయని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు అడ్డు పడినా జిల్లాలో కాంగ్రెస్ పదికి పది స్థానాలను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Renuka Chowdhury
Congress Leader Renuka Chowdhury : రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ దని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్ లతో నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మిస్తుండగానే కూలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లి రైతు బంధు అంటే నవ్వు వస్తుందన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్లాయని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు అడ్డు పడినా జిల్లాలో కాంగ్రెస్ పదికి పది స్థానాలను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ 18 ఏళ్ళ యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించారని తెలిపారు. బీఆర్ఎస్ కొత్త సినిమాను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ కి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఓట్లకు డబ్బులు పంచి గెలుద్దామనుకునే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. అసమర్ధ ప్రభుత్వాలు ప్రజలను హింసించాయని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మైనారిటీలు కాంగ్రెస్ వెంట ఉన్నారని తెలిపారు. ఎంఐఎంకి మైనారిటీలు దూరం అయ్యారని చెప్పారు.
మహ్మద్ అజురుద్దీన్ ప్రచారంలో పాల్గొంటున్నారని వెల్లడించారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. లక్షలాది మంది ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ళు కట్టించామని గుర్తు చేశారు. ఓటు సామాన్యుడికి బ్రహ్మాస్త్రమని, భవిష్యత్తు ఉండాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.