TRS Rythu Bandhu : టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్-పురపాలకశాఖ మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

TRS Rythu Bandhu : టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్-పురపాలకశాఖ మంత్రి కేటీఆర్

KTR on Rythu Bandhu

Updated On : January 10, 2022 / 2:30 PM IST

TRS Rythu Bandhu :  టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు ఆయన తెలంగాణ భవన్ లో రైతుబంధు పధకం గురించి మట్లాడారు. ఈ రోజు తెలంగాణ చరిత్ర లొనే కాదు స్వాతంత్ర భారత చరిత్ర లో సువర్ణాక్షరా లతో లిఖించదగ్గ రోజని ఆయన అన్నారు. 65 లక్షల రైతుల కుటుంబాలు,60 లక్షల టీఆర్ఎస్ కార్యకర్తల తరపున సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెపుతున్నానన్నారు.

రైతు బంధు ద్వారా 50 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం మామూలు విషయం కాదని ఆయన చెప్పారు.ఈ సంబరాలను సంక్రాంతి దాకా పొడిగిస్తున్నామని …వ్యవసాయ చరిత్ర లో ఇదొక సువర్ణ అధ్యాయం అని కేటీఆర్ చెప్పారు. రైతులకు ఇంత మేలు జరుగుతుంటే కొందరు పొలిటికల్ టూరిస్ట్ లు రాష్ట్రానికి వచ్చి ఎదో మాట్లాడుతున్నారని బీజేపీ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఉమ్మడి రాష్ట్రం లో రైతులు అన్నీ కష్టాలే పడ్డారని…..అప్పటి ఆంధ్ర ప్రదేశ్ వరస క్రమం లో మొదటి స్థానమే కాదు.. రైతుల ఆత్మహత్యల్లో కూడా మొదటి స్థానంలో ఉండేదని వివరించారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి ఎంత మారిందో తెలంగాణ ప్రజలు గుండె మీద చేయి పెట్టుకుని ఆలోచించాలని కేటీఆర్ కోరారు. అపుడు ఊర్లకు ఊర్లె వల్లకాడుగా మారాయని….ఉద్యమం లో రైతుల దుస్థితి చూసి కేసీఆర్ చలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.
Also Read : Sankranthi Brahmotsavalu : జనవరి 12 నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు ట్రైనీ ఐఎస్ లకు పాఠ్యంశాలు గా మారాయని కేటీఆర్ చెప్పారు. కోటి ఎకరాల మాగాణే కాదు ..ముక్కోటి టన్నుల ధాన్యగారం గా తెలంగాణ మారిందని ఆయన అన్నారు. రైతు బంధు పెట్టుబడి సాయం కాంగ్రెస్ నేతల అకౌంట్లలో కూడా పడుతోందని అందుకు నా దగ్గర ఆధారాలున్నాయని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ పధకాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని ఆయన తెలిపారు.