Telangana : సీఐని దూషించిన ఆడియో నాది కాదు..నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: పట్నం మహేందర్ రెడ్డి

సీఐని దూషించిన ఆడియో నాది కాదని..ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నాపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు.

Telangana : సీఐని దూషించిన ఆడియో నాది కాదు..నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: పట్నం మహేందర్ రెడ్డి

Trs Mlc Mahender Reddy On Tandur Ci Issue

Updated On : April 28, 2022 / 11:58 AM IST

TRS MLC Mahender Reddy On Tandur CI Issue :  సీఐ రాజేందర్ రెడ్డిని దూషించిన ఆడియో నాది కాదు అని..ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నాపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులు అంటే నాకు ఎంతో గౌరవం ఉందని తాండూరు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం (ఏప్రిల్ 28,2022) మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. తనపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు పట్నం. తాండూరు ప్రజలు రౌడీలు కాదు దేవుళ్లు అంటూ చెప్పుకొచ్చారు. తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని దూషించినట్టుగా చెబుతున్న ఆడియో తనది కాదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పదే పదే స్పష్టం చేశారు. సీఐ అంటే తనకు గౌరవం ఉందని అంత గౌరవం ఉన్న నేను సీఐను ఎలా దూషిస్తాను అంటూ ప్రశ్నించారు.

Also read : India Covid-19 : 46 రోజుల తర్వాత.. దేశంలో 3వేల మార్క్ దాటిన కరోనా కేసులు!

ఇసుక దందాలు ఎవరు చేస్తున్నారో ప్రజలకు తెలుసు అంటూ పరోక్షంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. తనపై వస్తున్న ఈ ఆరోపణలపై తాను దేనికైనా సిద్దంగా ఉన్నానంటూ చెప్పిన ఎమ్మెల్సీ పట్నం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేస్తున్న అరాచకాలపై న్యాయపరంగా పోరాడతాను అని తెలిపారు. రోహిత్ రెడ్డి చేస్తున్న అరాచకాలపై ఇప్పటికే తాను అధిష్టానికి ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చారు. తనేమిటో అధిష్టానికి తెలుసనీ..పార్టీ నాకు టికెట్ ఇచ్చి తీరుతుందని ధీమా వ్యక్తంచేసిన పట్నం నేను గెలుపు సాధిస్తాను అంటూ ధీమా వ్యక్తంచేశారు. నేను సీఎం రాజేందర్ రెడ్డిని దూషించలేదని మరోసారి చెబుతున్నానని కాదూ కూడదంటూ పోలీసులు తనకు నోటీసులు ఇస్తే కోర్టులోనే తేల్చుకుంటానని తెలిపారు.

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంట ఉన్న వారంతా కాంగ్రెస్ నుండి వచ్చారని..నిజమైన టీఆర్ఎస్ వాదులను కక్ష గట్టి బెదిరింపులకు దిగుతున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై కేసులు పెడుతున్నారన్నారు. పథకం ప్రకారంగా తమ వారిపై కేసులు పెట్టి అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి విమర్శలు చేశారు.

Also read : జాతీయ రాజకీయాలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ఒకే పార్టీలో ఉంటూ ఈ విషయమై విమర్శలు చేయవద్దని తాను ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని మహేందర్ రెడ్డి వివరించారు. తనకు స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఏం గొడవో అందరికీ తెలుసునని చెప్పారు. తాండూరుకు వస్తే ఏం జరుగుతుందో తెలుస్తుందని మహేందర్ రెడ్డి తెలిపారు. తన వెంట రాని వారిపై ఎమ్మెల్యే కేసులు పెట్టిస్తున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ తరహా అరాచకాలను తాను ప్రశ్నిస్తున్నందుకే తాండూరులో ఇలా జరుగుతుందని మహేందర్ రెడ్డి ఆరోపించారు.

కర్ణాటకకు ఇసుకను ఎవరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారో కూడా స్థానికులకు తెలుసునని..ఈ విషయాలపై పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొని పాయినట్టుగా మహేందర్ రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే అరాచకాలపై పార్టీ నాయకత్వం చూస్తుందని మహేందర్ రెడ్డి వివరించారు. టీఆర్ఎస్ లో తాము బలంగా ఉన్నామన్నారు. తన భార్య జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా తాను ఎమ్మెల్సీగా తన సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నాడన్నారు. ఇవన్నీ చూసీ ఓర్వలేకనే పథకం ప్రకారం ఇలా చేస్తున్నారని మహేందర్ రెడ్డి చెప్పారు.

Also read : Andhra Pradesh : జగన్ తరువాత నెంబర్ 2 అతనేనా? వైసీపీలో కీలక మార్పులు..

కాగా ఏప్రిల్ 23న తాండూరులో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులతో కూర్చొన్నా కూడా సీఐ రాజేందర్ రెడ్డి వారించలేదనే ఆగ్రహంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫోన్ చేసి దూషించారనే ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఆడియో ఆధారంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై తాండూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు పట్నం మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కానీ తాను సీఐని బెదిరించలేదన్నారు. సీఐని బెదిరించినట్టుగా ఉన్న ఆడియో తనది కాదని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.