D.Srinivas : మళ్లీ కాంగ్రెస్‌లోకి ఎంపీ ధర్మపురి శ్రీనివాస్
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ తిరిగి సొంత గూటికి వెళ్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. శుక్రవారం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

Dsrinivas
DSrinivas : టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ తిరిగి సొంత గూటికి వెళ్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. శుక్రవారం(డిసెంబర్17, 2021) నాడు ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. రేపు ఉదయం 11.30కి డీఎస్ కు సోనియా గాంధీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. రేపు మధ్యాహ్నం ఏఐసీసీ కార్యాలయంలో పార్టీలో చేరనున్నారు డీఎస్. మరోవైపు ఢిల్లీకి రావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు అధిష్టానం నుంచి ఫోన్ వచ్చింది.
డీఎస్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా పని చేశారు. 2004లో పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక డీ.శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ లో తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారని డీఎస్ ఆరోపించారు. అదే సమయంలో టీఆర్ఎస్ నుండి ఆహ్వానం రావడంతో ఆయన కారెక్కారు.
WhatsApp Group Admins : వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు న్యూ పవర్..? అందరి మెసేజ్‌లు డిలీట్ చేయొచ్చు!
అయితే, నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు డీఎస్ పై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేసినా డీఎస్ కు అపాయింట్‌మెంట్ లభ్యం కాలేదు. అప్పటి నుండి ఆయన టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. ఎంపీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. డీఎస్ కాంగ్రెస్ లో చేరతారని కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి వెళ్తారనే ప్రచారమూ నడిచింది. కాగా, డీఎస్ తనయుడు అరవింద్ గత ఎన్నికల్లో బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాడు. ఆయన విజయం వెనుక.. డీఎస్ కీలకంగా వ్యవహరించారనే టాక్ వినిపించింది.