MPTC : గొర్రెల కాపరిగా మారిన ఎంపీటీసీ.. రోజు కూలి రూ.500
ఆయనో ప్రజాప్రతినిధి.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో చేసేదేమి లేక గొర్ల కాపరిగా పనిలో కుదిరాడు. ఎంపీటీసీగా గెలిచి రోజుకు రూ.500లకి గోర్లు కాసేందుకు వెళ్తున్నాడు.

Mptc (2)
MPTC : ఆయనో ప్రజాప్రతినిధి.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో చేసేదేమి లేక గొర్ల కాపరిగా పనిలో కుదిరాడు. ఎంపీటీసీగా గెలిచి రోజుకు రూ.500లకి గోర్లు కాసేందుకు వెళ్తున్నాడు. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం శాగాపుర్‌కు చెందిన సుబ్బయ్యయాదవ్, 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శాగాపూర్ నుంచి ఎంపీటీసీగా విజయం సాధించాడు.
చదవండి : MPTC Elections Results : చంద్రబాబు ఇలాకాలో చరిత్ర తిరగ రాసిన అశ్విని
అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కరూపాయి నిధులు కూడా విడుదల కాలేదు. దీంతో చేసేదేమి లేక కుటుంబ పోషణ కోసం గొర్ల కాపరిగా మారడు. గ్రామానికి చెందిన కొమ్ము బిచ్చన్న, ఆడేం రాములు వద్ద రూ.500 కూలికి గొర్ల కాపరిగా చేరాడు. గత కొద్దీ రోజులుగా ఇదే పని చేస్తున్నాడు సుబ్బయ్య. ప్రభుత్వం ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సుబ్బయ్యయాదవ్ పేర్కొంటున్నారు.
చదవండి : Telangana RTC: త్వరలో పెరగనున్న ఆర్టీసీ టికెట్ల చార్జీలు?