భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు.. ఫలితాలపై ఏమన్నారంటే?
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Kishan Reddy
Kishan Reddy : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లలో విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి.. మూడోసారి కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావటం ఖాయమని అన్నారు.