TS DSC: గుడ్‌న్యూస్.. తెలంగాణ డీఎస్సీ.. 5,089 టీచర్ ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా

భర్తీ కానున్న పోస్టులు.. 2575- ఎస్జీటీ, 1735- స్కూల్ అసిస్టెంట్లు, 611- భాషా పండితులు..

TS DSC: గుడ్‌న్యూస్.. తెలంగాణ డీఎస్సీ.. 5,089 టీచర్ ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా

Telangana Dsc

Updated On : August 25, 2023 / 4:24 PM IST

TS DSC – 2023: తెలంగాణ(Telangana)లో 5089 టీచర్ పోస్టుల (Teacher Posts) భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీచర్ పోస్టుల్లో కనీసం కొన్నింటిని భర్తీ చేసేందుకు ఉత్తర్వులు వస్తాయని చాలా మంది ఊహించారు.

పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది. తాజాగా, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా సంబంధిత అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్సీ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, సెప్టెంబరు 15న టెట్‌ నిర్వహించనున్నారు. వాటి ఫలితాలు అదేనెల 27న విడుదల అవుతాయి. టెట్ ఉత్తీర్ణులు తెలంగాణలో నాలుగు లక్షల మందికిపైగా ఉన్నారు.

మరోవైపు, శుక్రవారం టీఆర్టీ పోస్టులకు సబితా ఇంద్రారెడ్డి నోటిఫికేషన్‌ ను విడుదల చేశారు. టీచర్ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)ల ద్వారా భర్తీ చేస్తామని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ డీఎస్సీకి జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌ గా, అదనపు కలెక్టర్‌ వైస్‌ చైర్మన్‌ గా వ్యవహరిస్తారు.

ఇక డీఈవో సెక్రటరీగా, అలాగే, జిల్లా పరిషత్‌ సీఈఓ సభ్యులుగా ఉంటారు. ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 2017లో టీఆర్టీ ద్వారా టీచర్‌ పోస్టులను భర్తీ చేశారు. అనంతరం ఇప్పటివరకు మళ్లీ నియామకాలు లేవు.

భర్తీ కానున్న పోస్టులు
2,575- ఎస్జీటీ
1,735- స్కూల్ అసిస్టెంట్లు
611- భాషా పండితులు
164- పీటీఈ పోస్టులు

TRT Notification : టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల.. 5,089 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Job Vacancies : కేంద్రప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ