Prabhakar Rao : విద్యుత్ సంస్థల్లో సమ్మె నిషేధం.. పాల్గొంటే కఠిన చర్యలు : డి.ప్రభాకర్ రావు
విద్యుత్ సంస్థలలో పనిచేసే ఆర్టిజన్లకు కూడా కార్మిక సంఘాల అభ్యర్ధనల మేరకు సహేతుకమైన వేతన సవరణ ఇచ్చామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని వెల్లడించారు.

Prabhakar Rao (1)
Prabhakar Rao : విద్యుత్ కార్మిక సంఘాలతో ఏప్రిల్ 15వ తేదీన వేతన సవరణ ఒప్పందం ముగిసిందని టీఎస్ జెన్ కో & టీ ఎస్ ట్రాన్స్ కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుత్ సంస్థలలో సమ్మె నిషేధం అమలులో ఉందని చెప్పారు. ఆర్టిజన్లు సమ్మెలో పాల్గొంటే సర్వీసు నిబంధన 34 (20) ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆర్ధిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏప్రిల్ 15వ తేదీన విద్యుత్ సంస్థలలో పనిచేసే అన్ని తరగతుల ఉద్యోగ సంఘాలతో వేతన సవరణ ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Telangana Power Consumption : తెలంగాణ చరిత్రలోనే రికార్డ్, అత్యధిక విద్యుత్ వినియోగం.. కారణం అదేనా?
ఈ క్రమంలో విద్యుత్ సంస్థలలో పనిచేసే ఆర్టిజన్లకు కూడా కార్మిక సంఘాల అభ్యర్ధనల మేరకు సహేతుకమైన వేతన సవరణ ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ కొందరు ఆర్టిజన్లు, పలు కార్మిక సంఘాలు.. ఆమోదం తెలిపిన వేతన సవరణ సరిపోలేదన్న సాకుతో ఏప్రిల్ 25 నుండి సమ్మెకు పిలుపు ఇచ్చినట్టు మేనేజ్ మెంట్ దృష్టికి వచ్చిందన్నారు.