Botsa Current Bill : బొత్స కరెంట్ బిల్లు బోగస్ సమాచారం-విద్యుత్ శాఖ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నరోడ్లు, మౌలిక వసతుల మీద గత 3 రోజులుగా ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుధ్దం కొనసాగింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో కరెంట్ లేదని, తాను రెండు రోజులు జనరేటర్ వేసుకుని ఉన్నానని.. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదే.... అని ఏపీ విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

Botsa Satyanarayana
Botsa Current Bill : ఆంధ్రప్రదేశ్ లో ఉన్నరోడ్లు, మౌలిక వసతుల మీద గత 3 రోజులుగా ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుధ్దం కొనసాగింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో కరెంట్ లేదని, తాను రెండు రోజులు జనరేటర్ వేసుకుని ఉన్నానని.. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదే…. అని ఏపీ విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
అనంతరం బొత్స సత్యానారాయణ హైదారాబాద్ లో ఉన్న తన ఇంటికి 15నెలలకుగా కరెంట్ బిల్లు కట్టలేదనే వార్త విద్యుత్ శాఖ విడుదల చేసినట్లుగా ఉన్న వార్త ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై తెలంగాణ దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి స్పందించారు.
తమ సంస్ధ బొత్స సత్యనారాయణకు చెందిన ఎటువంటి సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేయలేదని తెలిపారు. సంస్ధ పేరు మీద అసత్య ప్రచారానికి పాల్పడుతున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Also Read : lockup Death : మరో లాకప్ డెత్ కేసు-10 రోజుల్లో రెండోది