TSPSC Paper Leak : TSPSC పేపర్ లీక్.. కొనసాగుతున్న ఆందోళనలు, సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్
TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పేపర్ లీకేజీల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

TSPSC Paper Leak : TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పేపర్ లీకేజీల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఏబీవీపీ ఆధ్వర్యంలో టీఎస్ పీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించారు ఏబీవీపీ శ్రేణులు. కమిషన్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని నిలువరించారు. ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యుడిగా టీఎస్ పీఎస్సీ చైర్మన్ ను తొలగించాలంటూ ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నిన్న టీఎస్ పీఎస్ సీ కార్యాలయం దగ్గర ఆందోళన చేసిన ఏడుగురు బీజేవైఎం నేతలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు వారిని చంచల్ గూడ జైలుకి తరలించారు.
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ స్కామ్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఓవైపు ఆందోళనలు కొనసాగుతుండగా.. మరోవైపు పోలీసుల దర్యాఫ్తు కూడా కంటిన్యూ అవుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 9మందిని అరెస్ట్ చేసి వారందరినీ నాంపల్లి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. వారందరికీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు వారిని చంచల్ గూడ జైలుకి తరలించారు.
మరోవైపు ఆందోళనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కమిషన్ కార్యాలయం ముందు ఆందోళనలో భాగంగా కొందరు వ్యక్తులు కమిషన్ బోర్డుని డ్యామేజ్ చేయడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దీంతో పోలీసులు బీజేవైఎం నేతలపై కేసు నమోదు చేశారు. ఏడుగురిని నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచగా, వారికి ఈ నెల 29 వరకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
Also Read..TSPSC Paper Leak : ఆ యువతి కోసమే.. TSPSC పేపర్ లీక్ వ్యవహారంలో సంచలన ట్విస్ట్