TS RTC : సందిగ్దంలో ఆర్టీసి ఉద్యోగులు-రిటైర్మెంట్ వయస్సుపై రాని క్లారిటీ
TSRTCలో ఉద్యోగుల వయోపరిమితిపై సందిగ్ధత ఇంకా వీడలేదు. గతంలో పెంచిన రెండేళ్ల పదవీ విరమణ గడువు నెలాఖరుతో పూర్తికానుంది. దీంతో పదవీ విరమణలు మొదలవుతాయా? లేక మరో ఏడాది గడువు పెరుగుతుందా?

Tsrtc Employees Retirement
TSRTCలో ఉద్యోగుల వయోపరిమితిపై సందిగ్ధత ఇంకా వీడలేదు. గతంలో పెంచిన రెండేళ్ల పదవీ విరమణ గడువు నెలాఖరుతో పూర్తికానుంది. దీంతో పదవీ విరమణలు మొదలవుతాయా? లేక మరో ఏడాది గడువు పెరుగుతుందా? అనేది హాట్ టాపిక్ అయ్యింది. అధికారులు మాత్రం మరో ఏడాదిని పొడిగించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టారు. ఇటువంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది?
2019లో తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచింది ప్రభుత్వం. ఆర్టీసీ ఉద్యోగుల విరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీతో రెండేళ్లుగా టీఎస్‌ఆర్టీసీలో రెండేళ్లుగా పదవీ విరమణలు నిలిచిపోయాయ్. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల పదవీ కాలాన్ని 61ఏళ్లకు పెంచింది టీఎస్ సర్కార్. ఆర్టీసీ ఉద్యోగుల పదవీకాలం కూడా పెరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. అటు ఉద్యోగులు కూడా అటువంటి ప్రతిపాదనలే ప్రభుత్వానికి పంపారు.
ఓవైపు అప్పులు.. మరోవైపు నష్టాలతో ఇటీవల వరకూ ఆర్టీసీ పరిస్థితి ఏమంత బాగాలేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయ్. 2019 మార్చిలో రిటైర్ అయిన వాళ్లకు మాత్రమే సెలవులు, చివరి నెల జీతాలను చెల్లించింది. ఆ తర్వాత రిటైర్ అయిన వాళ్లకు ఇంకా చెల్లింపులు జరగలేదు. ఆ మొత్తం విలువ వంద కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా.
2019లో ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఉద్యోగ విమరణల లెక్కలపై కసరత్తు చేశారు అధికారులు. వాటి ప్రకారం.. 2019కి 659 మంది, 2020కి 2వేల 615మంది, 2021కి 4వేల 690 మంది రిటైర్ అవ్వాలి. రెండేళ్లలో పదవీ విరమణ లేకపోవడంతో పదవీ విరమణ చేసే ఉద్యోగుల సంఖ్య దాదాపు 8వేలకు చేరింది. ఆ సంఖ్య ప్రతీ ఏడాదికి పెరుగుతోందే తప్ప తగ్గే అవకాశం కనిపించడం లేదు. వారందరికీ పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయలేని పరిస్థితి.
Also Read : Telangana Employees : ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ఉద్యోగుల విభజన, బదిలీలు
ఆర్టీసీలోని కార్మికులు కూడా పదవీ విరమణపై ఆసక్తి చూపడం లేదు. పని భారం పెరిగిపోవడంతో 45 ఏళ్లు దాటిన వారు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు మాత్రం మరోసారి ఉద్యోగ విరమణ కాలాన్ని మరో ఏడాది పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.