మెట్రో రైలు తరహాలో బస్సుల్లో సీటింగ్ మార్పు.. ఆర్టీసీ కొత్త ప్రయోగం

మెట్రో రైలులో సీట్ల మాదిరి బస్సుల్లోనూ సీటింగ్ మార్చేస్తోంది. సైడ్లకు సీట్లను ఏర్పాటు చేయడం ద్వారా మధ్యలో ఎక్కువమంది నిల్చోవచ్చని భావిస్తోంది.

మెట్రో రైలు తరహాలో బస్సుల్లో సీటింగ్ మార్పు.. ఆర్టీసీ కొత్త ప్రయోగం

TSRTC New Plan

TSRTC : హైదరాబాద్ సిటీ బస్సుల్లో సీటింగ్ పద్ధతి మారింది. హైదరాబాద్ మెట్రో ట్రైన్ తరహాలో బస్సుల్లోనూ సీటింగ్ మార్చారు. మహాలక్ష్మి పథకం అమలుతో హైదరాబాద్ సిటీ బస్సుల్లో రద్దీ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీటింగ్ లో పలు మార్పులు చేశారు అధికారులు. ఉదయం సాయంత్రం వేళల్లో సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో బస్సు నిండా సీట్లు ఉంటే ఎక్కువమంది ప్రయాణించడానికి వీలు ఉంటం లేదని గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో ప్రయోగాత్మకంగా బస్సుల్లో సీటింగ్ మార్చారు. మెట్రో ట్రైన్ తరహాలో ఆర్టీసీ సిటీ బస్సుల్లో సీటింగ్ మార్చేశారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంటోంది. దీంతో టీఎస్ ఆర్టీసీ వినూత్న నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలులో సీట్ల మాదిరి బస్సుల్లోనూ సీటింగ్ మార్చేస్తోంది. సైడ్లకు సీట్లను ఏర్పాటు చేయడం ద్వారా మధ్యలో ఎక్కువమంది నిల్చోవచ్చని భావిస్తోంది. ఈ సీటింగ్ మార్పు ద్వారా ఒక్కో బస్సులో సాధారణం కంటే మరో 25మంది ప్రయాణించవచ్చని అధికారులు అంచనా వేశారు.