తెలంగాణకు మోదీ, అమిత్ షా సహకారం అందిస్తున్నారు: మంత్రి తుమ్మల కీలక కామెంట్స్‌

పసుపు బోర్డుపై బీజేపీ ఎంపీ అరవింద్ మాట నిలబెట్టుకున్నారని ప్రశంసించారు.

తెలంగాణకు మోదీ, అమిత్ షా సహకారం అందిస్తున్నారు: మంత్రి తుమ్మల కీలక కామెంట్స్‌

Updated On : June 29, 2025 / 3:51 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు సహకారం అందిస్తున్నారని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ నిజామాబాద్‌లో కిసాన్ సభ జరిగింది. ఈ సభకు కేంద్ర మంత్రి అమిత్‌ షా హాజరయ్యారు.

ఈ సభలో తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. రైతుల పోరాట ఫలితంగా పసుపు బోర్డు ఏర్పాటైందని తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఇంతమంది రైతులకు గౌరవం దక్కిందని చెప్పారు. పసుపు బోర్డుపై బీజేపీ ఎంపీ అరవింద్ మాట నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. ఈ బోర్డుతో రైతులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.

Also Read: ఇన్ఫినిక్స్ నుంచి మార్కెట్లో తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌.. మార్కెట్‌ను ఊపేసే ఛాన్స్‌.. ఎందుకంటే?

సులభమైన వ్యవసాయ పద్ధతులు అందుబాటులోకి వస్తాయని తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మోదీ, అమిత్ షా తెలంగాణకు సహకారిస్తున్నారని, కేంద్రం సహకారంతో రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తోందని చెప్పారు. మోదీ, అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు.