Rape In Gandhi hospital :గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Rape In Gandhi hospital :గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం

Two Sisters Gang Raped At Gandhi Hospital

Updated On : August 16, 2021 / 5:37 PM IST

woman kidnap and gang raped by gandhi hospital staff : వేలాదిమంది రోగులు, వందలాదిమంది వైద్యసిబ్బందితో నిత్యం రద్దీగా ఉండే గాంధీ ఆస్పత్రితో ఇద్దరు అక్కాచెల్లెళ్లు అత్యాచారానికి గురైన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిద్దరిలో అక్క కనిపించకకుండాపోయింది. తన ఇద్దరు కూతుళ్లు ప్రాణాలు పోసే ఆస్పత్రిలోనే సామూహిక అత్యాచారానికి గురి కావటంతో తల్లడిల్లిపోయిన తల్లి చిన్న కూతురుని తీసుుకుని పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అన్యాయం అయిపోయిన నా కూతుళ్లకు న్యాయం చేయండయ్యా అంటూ పోలీసులనువేడుకుందా తల్లి.

మహబూబ్ నగర్ కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు గాంధీ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన ఘటన సంచలనం కలిగించింది. వీరిలో అక్క మాయం అయ్యింది.చెల్లెలు తల్లి సహాయంతో చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ అఘాయిత్యానికి పాల్పడింది ల్యాబ్ టెక్నీషియన్ ఉమామహేశ్వర రావు,సెక్యూరిటీ గార్డు గా తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో ల్యాబ్ టెక్నీషిన్ ఉమామహేశ్వరరావుని పోలీసులు అరెస్ట్ చేయగా సెక్యూరిటీ గార్డు పరార్ అయ్యాడు. పరారీలో ఉన్న సెక్యూరిటీ గార్డు కోసం పోలీసులు గాలిస్తుస్తున్నారు.

వివరాల్లోకి వెళితే..తన బావ చికిత్స కోసం ఈ నెల 4వ తేదీన గాంధీలో చేరగా అక్కడ సిబ్బంది తనపై అత్యాచారం చేశారంటూ ఒక మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన అక్కను.. తనను గదిలో బంధించి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.

అయితే కిడ్నాపర్ల చెర నుంచి తాను తప్పించుకొని బయటపడ్డానని.. కానీ తన అక్క ఆచూకీ తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మహబూబ్ నగర్ జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లామని..కొందరి సహాయంతో హైదరాబాద్ చిలకల గూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వచ్చానని తెలిపింది.