Bandi Sanjay: అదిరిన బండి సంజయ్ లుక్‌.. ఆర్ఎస్‌ఎస్‌ యూనిఫామ్‌లో.. కవాతులో పాల్గొన్న కేంద్రమంత్రి

కరీంనగర్ లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా బండి సంజయ్ జీవితం ప్రారంభమైంది.

Bandi Sanjay: అదిరిన బండి సంజయ్ లుక్‌.. ఆర్ఎస్‌ఎస్‌ యూనిఫామ్‌లో.. కవాతులో పాల్గొన్న కేంద్రమంత్రి

Updated On : October 12, 2025 / 7:56 PM IST

Bandi Sanjay: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ లో పథ సంచలన్ (ఆర్ఎస్ఎస్ కవాతు) జరిగింది. ఈ కవాతులో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ లో ఆయన లుక్ అదిరింది. రాష్ట్రీయ స్వయం సేవక్ గా కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఆర్ఎస్ఎస్ కవాతులో పాల్గొన్నారు. రాంనగర్ నుండి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ గ్రౌండ్ వరకు రూట్ మార్చ్ సాగింది.

రాంనగర్ సత్యనారాయణ స్వామి టెంపుల్ నుండి ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ లో పాల్గొన్నారు బండి సంజయ్. ఆర్ఎస్ఎస్ వస్త్రధారణలో ఆయన ఆకట్టుకున్నారు. బండి సంజయ్ తో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ రూట్ మార్చ్ లో ఆయన కుమారుడు బండి సాయి సుముఖ్ పాల్గొన్నారు. కరీంనగర్ లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా బండి సంజయ్ జీవితం ప్రారంభమైంది. చదువుకునే సమయంలో రాంనగర్ బస్తీలో ముఖ్య శిక్షక్ గా కొనసాగారు. ఆర్ఎస్ఎస్ పథ సంచలన్ సమారోప్ కార్యక్రమంలో బండి సంజయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతా ఆయనను ఆసక్తిగా తిలకించారు.

Also Read: బీసీ రిజర్వేషన్లు.. తగ్గేదేలే అంటున్న కాంగ్రెస్.. రేపు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం..

”7 తరగతిలో బాల స్వయంసేవక్ గా చేరి, ఆనాటి నుండి నేటివరకు ఎత్తిన కాషాయ ధ్వజం దించకుండా భుజాన మోస్తూ, భరతమాత సేవలో తరిస్తుండడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ ఈ శరీరం ఉన్నంతవరకు భరతమాత పరమ వైభవ స్థితి కోసం నేను ఎంచుకున్న మార్గం ఎంత కఠినమైనప్పటికీ భరతమాత పాదాల సేవ విడువను అని తెలియజేస్తూ…ఈరోజు సంఘ శక్తిని చాటుటకు గణవేషధారినై పథసంచలన్ లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అంటూ బండి సంజయ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.