Tirupati Stampede Row: తిరుపతి ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఏమన్నారంటే?

Bandi Sanjay: తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తొక్కిసలాట ఘటన నా మనసును కలిచివేసిందని అన్నారు.

Tirupati Stampede Row: తిరుపతి ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఏమన్నారంటే?

Union Minister Bandi Sanjay

Updated On : January 9, 2025 / 2:58 PM IST

Tirupati Stampede Row: తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా.. మరికొందరు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్ల కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నా మనసును కలిచివేసిందని అన్నారు.

Also Read: Tirupati stampede: తిరుపతి ఘటనపై స్పందించిన మాజీ మంత్రి రోజా.. వారిద్దరి వల్లే ఈ పరిస్థితి అంటూ ఆగ్రహం

ఈ హృదయ విదారక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అన్నివిధాలా ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన సాయం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని బండి సంజయ్ కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇకపై మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ ప్రభుత్వానికి సూచించారు.