Bandi Sanjay: అదీ నా చరిత్ర..! కొత్త పార్టీ ప్రచారంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..
కేసీఆర్ గడీలను కూలగొట్టింది మేమే, కేసీఆర్ ని గద్దె దించింది మేమే.. అందుకే కేసీఆర్ కు మా మీద కసి ఉంది.
Bandi Sanjay: కొంత మంది స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్ కొత్త పార్టీ పెడుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన తనకు లేదన్నారు, రాదన్నారు. తాను అలాంటి నాయకుడిని కాదని క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్. తాను కమిట్ మెంట్ తో పని చేసే కార్యకర్తను అని తేల్చి చెప్పారు. తుది శ్వాస వరకు బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. కేసీఆర్ చేతిలో ఏమైనా 17 మంది ఎంపీలు ఉన్నారా..? మోదీ ప్రభుత్వం ఏమైనా కేసీఆర్ దయ మీదనే నడుస్తోందా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుని బండి సంజయ్ ని బర్తరఫ్ చేయాలంటున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ గడీలను కూలగొట్టింది మేమే, కేసీఆర్ ని గద్దె దించింది మేమే.. అందుకే కేసీఆర్ కు మా మీద కసి ఉందన్నారు. కేటీఆర్ ఫేక్ సోషల్ మీడియా ఫ్యాక్టరీని నడుపుతున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. బండి సంజయ్ ఏంటో కార్యకర్తలకు తెలుసు అని వ్యాఖ్యానించారు. బండి భగీరథ్ వ్యవహారం కోర్టులో ఉందన్నారు బండి సంజయ్. తన కొడుకును తానే స్వయంగా పోలీసులకు అప్పగించానని, అదీ తన చరిత్ర అని బండి సంజయ్ అన్నారు.
Also Read: ‘హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు.. నెలకు రూ.52 వేల జీతం’.. కఠిన చర్యలు తప్పవంటున్న జలమండలి
