Bandi Sanjay : రాజాసింగ్‌తో భేటీ తర్వాత బండి సంజయ్ కామెంట్స్.. బీజేపీలో విబేధాలపై..
HCU భూముల అమ్మకుండా కోర్టు అడ్డుకుంటుందనే నమ్మకం తమకుందన్నారు బండి సంజయ్.

Bandi Sanjay : Bandi Sanjay : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో భేటీ తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీలో విబేధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్. బీజేపీలో ఎటువంటి విబేధాలు లేవని ఆయన తేల్చి చెప్పారు. రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే అని, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని బండి సంజయ్ పేర్కొన్నారు.
రాజాసింగ్ తో బండి సంజయ్ భేటీ తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇకపై రాజాసింగ్ పార్టీ లైన్ లో నడవనున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరపున రాజాసింగ్ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. హిందూత్వం వర్సెస్ ఎంఐఎంగా ఎన్నికలను అభివర్ణించారు బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆలోచన చేసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా హిందుత్వ అజెండాతో ముందుకెళ్తామన్నారు
అటు మాజీమంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు బండి సంజయ్. హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి భూముల వెనుక బీజేపీ ఎంపీ ఉన్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు బండి సంజయ్. బ్రోకర్ ఎవడో తెలుసు అన్న బండి సంజయ్.. బీజేపీ ఎంపీ ఉంటే పేరు ఎందుకు బయట
పెట్టడం లేదని కేటీఆర్ ను నిలదీశారు.
కేటీఆర్ కళ్ళు, చెవులు పని చేయడం లేదని ఏదేదో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆసరా, రైతు భరోసా, నిరుద్యోగ భృతి ఇలా ప్రతీ అంశంపై మాట్లాడింది నేను.. HCU భూముల కోసం కోట్లడింది మేము.. ఏబీవీపీ కార్యకర్తలు ఇప్పటికీ జైల్లో ఉన్నారని బండి సంజయ్ అన్నారు. HCU భూముల అమ్మకుండా కోర్టు అడ్డుకుంటుందనే నమ్మకం తమకుందన్నారు బండి సంజయ్.
Also Read : ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు.. నరకం అంటే ఏంటో చూపిస్తా అంటూ..
”కేంద్రం ఇచ్చే బియ్యం వద్దని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కిలో బియ్యానికి ఇచ్చే 37 రూపాయలు అవసరం లేదని చెప్పండి. రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీలో ఎటువంటి విభేదాలు లేవు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఉన్న హిందూ కార్పొరేటర్లు ఎంఐఎంకు ఓటేస్తే భాగ్యనగర్ ప్రజలు క్షమించరు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అధినాయకుల మాటలు విని ఎంఐఎంకు సపోర్ట్ చేస్తే.. వచ్చే GHMC ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు.
కోరిన కోర్కెలు తీర్చే ఆకాశ్ పురి దేవాలయం. శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూ సమాజం ఐక్యతను చూపడానికి అనేక ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. శక్తిని, ధైర్యాన్ని ఇచ్చే దేవుడు హనుమంతుడు. హిందూ సమాజం సంఘటింతగా ఉండాలని కోరుకుంటున్నా” అని బండి సంజయ్ అన్నారు.
కాగా, హెచ్‌సీయూ భూముల వివాదంలో సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హెచ్ సీయూ భూముల వెనుక 10 వేల కోట్ల ఆర్థిక కుంభకోణం ఉందన్నారాయన. కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఆరోపించారు. అటవీ భూమిని తాకట్టు పెట్టడం, అమ్మే అధికారం ప్రభుత్వానికి కూడా లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అన్నీ తెలిసే భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని చెప్పారు. అంతేకాదు ఈ వ్యవహారంలోకి బీజేపీని కూడా లాగారాయన. ఒక బీజేపీ ఎంపీ సపోర్ట్‌తో రేవంత్ రెడ్డి.. హెచ్‌సీయూ భూముల కుంభకోణానికి తెరతీశారని కేటీఆరో ఆరోపించారు.