YouTuber Shankar : యూట్యూబర్ శంకర్ బాధితురాలు సంచలన వీడియో.. కేటీఆర్‌కు సూటి ప్రశ్న..!
YouTuber Shankar : కేటీఆర్ అన్నా.. మీ పార్టీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఓ మహిళ సంచలన వీడియోను విడుదల చేసింది.

YouTuber Shankar
YouTuber Shankar : యూట్యూబర్ శంకర్ బాధితురాలు సంచలన వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో కేటీఆర్‌కు బాధితురాలు సూటి ప్రశ్న వేసింది. శంకర్ బెయిల్ పిటిషన్‌లో తనపై తప్పుడు ఆరోపణలు మెన్షన్ చేసి బెయిల్ ఎలా ఇపిస్తారంటూ కేటీఆర్‌ను ఆమె ప్రశ్నించింది.
తాను తప్పుడు కేసులు పెడుతూ చాలా మందిని బెదిరించానని శంకర్ బెయిల్ పిటిషన్‌లో ఎలా మెన్షన్ చేస్తారంటూ ప్రశ్నించింది. జర్నలిస్ట్ శంకర్ తనను మోసం చేసి జీవితం నాశనం చేసినందుకు కేసు పెట్టినట్టు బాధితురాలు పేర్కొంది. అయితే, అలాంటి వాడికి మీరు ఎలా బెయిల్ ఇప్పిస్తారు కేటీఆర్ అన్న అంటూ బాధితురాలు వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also : HYDRAA : హైడ్రా పేరుతో బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్.. ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక..!
పార్టీలో ఆడపిల్లలకు చాలా మర్యాద ఇస్తామని చెప్తూ ఉంటారు. మీ మర్యాద ఇదేనా కేటీఆర్ అన్న అంటూ బాధితురాలు ప్రశ్నించింది. శంకర్ మోసం చేశాడని మీకు చాలాసార్లు సోషల్ మీడియా ద్వారా ట్యాగ్ చేసి చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంది.
నేను ఎవరి మీదైనా తప్పులు కేసులు పెడితే నిరూపించండి దేనికైనా సిద్ధమని తెలిపింది. నాకు మీరే న్యాయం చేయాలని వేడుకుంటున్న కేటీఆర్ అన్న అంటూ వీడియోలో బోరుమని విలపించింది. ఒక ఆడపిల్లకు అన్యాయం చేసిన వాడికి నాపై తప్పుడు ఆరోపణలు మెన్షన్ చేసి ఎలా బెయిల్ ఇప్పిస్తారో చెప్పాలంటూ కేటీఆర్‌ను బాధితురాలు ప్రశ్నించింది.