నిర్భయ దోషులకు ఉరి : రాములమ్మ ఉద్వేగభరిత సందేశం

నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి స్పందించారు.

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 01:50 AM IST
నిర్భయ దోషులకు ఉరి : రాములమ్మ ఉద్వేగభరిత సందేశం

Updated On : January 8, 2020 / 1:50 AM IST

నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి స్పందించారు.

నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి స్పందించారు. సోషల్ మీడియాలో ఉద్వేగభరిత సందేశం పెట్టారు. నిర్భయ విషయంలో కోర్టు ద్వారా వచ్చిన తీర్పును, దిశ విషయంలో ప్రజా ఆగ్రహజ్వాలల నుండి ప్రకృతి విధించిన శిక్షను.. ప్రతి స్త్రీ మూర్తి మనస్ఫూర్తిగా అభినందించ తగినవని అన్నారు. ఈ రెండు శిక్షలు భారత దేశంలో న్యాయం, దైవం ఉన్నాయనే నమ్మకాన్ని కలిగించాయన్నారు. ఆడబిడ్డలు, బిడ్డల తల్లులు క్షేమంగా, ధైర్యంగా బతికే సమాజం కోసం.. ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం కేసులో.. ఢిల్లీలోని పాటియాల కోర్టు సంచలన తీర్పుఇచ్చింది. ఈ కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఉరిశిక్షను ఖరారు చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ 14 రోజుల్లో.. దోషులు వారి న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని పేర్కొంది. కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బాధితురాలి కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.

“నిర్భయ విషయంలో కోర్టు ద్వారా వచ్చిన తీర్పు అయినా.. దిశ విషయంలో ప్రజా ఆగ్రహజ్వాలల నుండి ప్రకృతి విధించిన శిక్ష అయినా.. స్త్రీ మూర్తి మనస్ఫూర్తిగా అభినందించ తగినవే… మన భారతదేశంలో న్యాయం, దైవం ఉన్నాయని నమ్మకం కలిగించేవే. ఆడబిడ్డలు, బిడ్డల తల్లులు క్షేమంగా, ధైర్యంగా బతికే సమాజం కోసం ప్రతి భారతీయ హృదయం నిజాయితీతో తల్లడిల్లుతూ… వ్యవస్థలను విశ్వసిస్తూ… పంచుకుంటున్న ఉద్వేగం ఈ అభిప్రాయం”. అని తన అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు విజయశాంతి.

Also Read : లేడీ సూపర్‌స్టార్‌.. సినిమాలపైనే విజయశాంతి ఫోకస్‌!