Vikarabad : వికారాబాద్ బాలిక కేసు.. చంపింది తల్లా ? ప్రియుడా ?
వికారాబాద్ జిల్లా అంగడిచిట్టంపల్లిలో.. పదోతరగతి బాలిక కేసు విచారణ.. పోలీసులకు సవాల్‌గా మారింది. కేసులో విచారణ చేపట్టే కొద్ది ట్విస్ట్ మీద ట్విస్ట్‌లు వస్తున్నాయి...

Vikarabad
Vikarabad Girl Case Mystery : వికారాబాద్ జిల్లా అంగడిచిట్టంపల్లిలో.. పదోతరగతి బాలిక కేసు విచారణ.. పోలీసులకు సవాల్‌గా మారింది. కేసులో విచారణ చేపట్టే కొద్ది ట్విస్ట్ మీద ట్విస్ట్‌లు వస్తున్నాయి. ఈ కేసును.. ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామన్న ఎస్పీ కోటిరెడ్డి.. ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. అయితే బాలిక తల్లి తీరు అనుమానాస్పదంగా మారడంతో.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. ఈమెతో పాటు ఆరుగురు అనుమానితులను విచారించామన్నారు. అయితే విచారణలో బాలిక తల్లి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె హత్య చేసి .. మరొకరిపై మోపే ప్రయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read More : Vikarabad Girl Case : వికారాబాద్ బాలిక కేసు.. నివేదిక వచ్చాకే హత్యాచారం జరిగిందో లేదో తెలుస్తుందన్న పోలీసులు
2022, మార్చి 28వ తేదీ సోమవారం ఉదయం 5.30 గంటలకు.. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకువెళ్లిన బాలిక.. ఎంతకీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు.. బాలిక కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే కొద్దిసేపటికే నిర్మానుష్య ప్రాంతంలో ఓ బాలిక మృతదేహం పడివుందంటూ.. స్థానికులు చెప్పడంతో.. బాలిక తల్లి వెళ్లి చూసింది. మృతదేహాన్ని చూస్తూనే..అది తన కూతురిదేనంటూ .. కుప్పకూలిపోయింది. అయితే.. గత కొన్ని రోజులుగా .. అదే గ్రామానికి చెందిన మహేందర్ అలియాస్ నానీ అనే వ్యక్తి .. తన కూతురిని వేధిస్తున్నాడని.. బాలిక తల్లి చెబుతోంది.
Read More : Suspicious Death: వికారాబాద్ జిల్లాలో దారుణం..!
నాలుగు రోజులుగా ఫోన్ చేస్తున్నాడని తెలిపింది. మృతురాలి తల్లి చెప్పిన వివరాల ప్రకారం …నానీతో పాటు మరో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఇప్పుడు బాలిక తల్లి తీరు అనుమానాస్పదంగా మారడంతో.. నిజాలు రాబట్టే పనిలో ఉన్నారు. కేసులో విచారణ చేపట్టే కొద్ది ట్విస్ట్ మీద ట్విస్ట్‌లు వస్తున్నాయి.