CP CV Anand : వెపన్స్ డిపాజిట్ చేయాలి లేకుంటే చర్యలు తప్పవు : సీపీ సీవీ ఆనంద్

డిసెంబర్ 10 తర్వాత డిపాజిట్ చేసిన వెపన్స్ తీసుకోవచ్చన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.

CP CV Anand : వెపన్స్ డిపాజిట్ చేయాలి లేకుంటే చర్యలు తప్పవు : సీపీ సీవీ ఆనంద్

CP CV Anand

Updated On : October 10, 2023 / 4:17 PM IST

CP CV Anand – Weapons Deposit : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా వెపన్స్ డిపాజిట్ చేయాలని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అక్టోబర్ 16 లోపు పోలీస్ స్టేషన్లలో వెపన్స్ సబిమిట్ చేయాలని ఆదేశించారు. వెపన్ సబ్ మిట్ చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ 10 తర్వాత డిపాజిట్ చేసిన వెపన్స్ తీసుకోవచ్చన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.

ఒకే విడతలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 10 నామినేషన్లకు చవరి తేదీ. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ.

Srinivas Goud : హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఊరట.. ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు విడుదల చేయనున్నారు. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ వెల్లడించింది.