Hyderabad Rains : రాగ‌ల 48 గంటల్లో హైద‌రాబాద్‌ నగరంలో వ‌ర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మరి తీరం దాటింది..దీని ప్రభావంతో రాగాల 48 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Hyderabad Rains : రాగ‌ల 48 గంటల్లో హైద‌రాబాద్‌ నగరంలో వ‌ర్షాలు

Hyderabad Rains

Updated On : November 20, 2021 / 10:48 AM IST

Hyderabad Rains :  తెలంగాణకు వర్షం హెచ్చరికలు జారీచేసింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మరి తీరం దాటింది..దీని ప్రభావంతో రాగాల 48 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

చదవండి : Heavy Rains : చిత్తూరు జిల్లాకు రూ.500 కోట్ల నష్టం

ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు గ్రేటర్‌ వ్యాప్తంగా తేలికపాటి వర్షం పడింది. జగద్గిరిగుట్టలో అత్యధికంగా 4.5 మి.మీలు వర్షపాతం నమోదైంది. ఇక నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట కోతకు వచ్చే సమయంలో అకాల వర్షాలు కురవడంతో పంటకు భారీ నష్టం జరిగింది.

చదవండి : Heavy Rains : కడప జిల్లాలో వర్ష బీభత్సం..జలదిగ్బంధంలో గ్రామాలు..నీట మునిగిన పంటలు