Rains: తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Rain (Representative image)
Rains – Telangana: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ (Meteorological) శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు (ఖమ్మం వరకు) ప్రవేశించాయి.
రాగల 2-3 రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని భాగాలకు విస్తరించే అవకాశం ఉంది. ఇవాళ ఆవర్తనము పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల వరకు కొనసాగుతుంది.
దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. దీంతో రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.