వెదర్ అప్ డేట్ : చలి పులి పంజా విసురుతోంది

తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల చలి పులి ఇంకా పంజా విసురుతోంది.

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 11:51 PM IST
వెదర్ అప్ డేట్ : చలి పులి పంజా విసురుతోంది

Updated On : January 30, 2019 / 11:51 PM IST

తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల చలి పులి ఇంకా పంజా విసురుతోంది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల చలి పులి ఇంకా పంజా విసురుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి. శీతల గాలుల విజృంభణ కారణంగా ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి అత్యంత బలంగా వీస్తున్న చలి గాలులు తెలంగాణను ఇప్పటికీ గజగజ విణికిస్తున్నాయి. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారం కన్నా 6,7 డిగ్రీల వరకు తగ్గుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున అదిలాబాద్ లో 7, హైదరాబాద్, రామగుండంలో 9, నిజామాబాద్ 10, మెదక్ లో 13 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అనేకచోట్ల కురుస్తున్న పొగమంచు జనజీవితాన్ని అతలాకుతలం చేస్తోంది.