రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత.. మరో 3 రోజులు ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

గ్రామాల ప్రజలు చలి మంటలతో సేద తీరుతున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత.. మరో 3 రోజులు ఈ ప్రాంతాల వారు జాగ్రత్త

Updated On : November 15, 2025 / 7:47 AM IST

Weather Updates: తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. సాయంత్రం 6 గంటలు దాటితే చాలు.. చల్లటి గాలులు వీస్తున్నాయి. మళ్లీ ఉదయం 9 గంటలు దాటేవరకు చలి వదలడం లేదు. ఉదయం వేళలో పలు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా కోహిర్‌లో 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రత 9.1 డిగ్రీలుగా నమోదైంది. గ్రామాల ప్రజలు చలి మంటలతో సేద తీరుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: బిహార్‌ ఎన్నికల్లో అత్యంత పిన్న వయసు ఎమ్మెల్యేగా ఎన్నికైన అమ్మాయి.. ఈమెకి కోట్లాది మంది ఫాలోవర్లు

తెలంగాణలో రానున్న రెండు, మూడు రోజులు రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా ఉండే ఛాన్స్‌ ఉందని అధికారులు చెప్పారు. కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చలి గాలులు వీయొచ్చని అన్నారు. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఉదయం 9 గంటల కంటే ముందుగా ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.