Naveen yadav : జూబ్లీహిల్స్‌లో గెలుపొందిన నవీన్ యాదవ్ ఆస్తులెన్నో తెలుసా..? ఏఏ కార్లు ఉన్నాయి..? ఎంత గోల్డ్ ఉంది..? ఫుల్ డీటెయిల్స్..

Naveen Yadav : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయంతో అందరి దృష్టిని ఆకర్షించిన నవీన్ యాదవ్ ఆస్తులు ఎన్ని..? ఆయన ఏఏ కారు వాడుతారు..

Naveen yadav : జూబ్లీహిల్స్‌లో గెలుపొందిన నవీన్ యాదవ్ ఆస్తులెన్నో తెలుసా..? ఏఏ కార్లు ఉన్నాయి..? ఎంత గోల్డ్ ఉంది..? ఫుల్ డీటెయిల్స్..

Naveen Yadav

Updated On : November 14, 2025 / 11:57 AM IST

Naveen yadav : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి నవీన్ యాదవ్ సమీప పత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఆధిక్యాన్ని ప్రదర్శించుకుంటూ వచ్చారు. అయితే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయంతో అందరి దృష్టిని ఆకర్షించిన నవీన్ యాదవ్ ఆస్తులు ఎన్ని..? ఆయన ఏఏ కారు వాడుతారు..? తదితర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన నవీన్ యాదవ్ తన నామినేషన్ పత్రాల్లో కీలకమైన అఫిడవిట్‌ను జతపర్చారు. ఆ వివరాల ప్రకారం.. నవీన్ యాదవ్ మొత్తం స్థిరాస్తుల విలువ రూ.29,66,39,250 తన పేరిట ఉన్నాయి.. రూ.5,75,71,250 భార్య పేరిట ఉన్నాయి. నవీన్ యాదవ్ పేరుతో అప్పులు రూ.75 లక్షలు ఉన్నట్లుగా అఫిడవిట్‌లో పొందుపర్చారు.

అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఐదు బ్యాంకు ఖాతాల్లో రూ.37.6లక్షలు నవీన్ యాదవ్ పేరుపై ఉండగా.. ఆయన భార్య పేరుపై రెండు అకౌంట్లలో రూ.10వేలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. నవీన్ యాదవ్ పేరుపై రూ.7లక్షల విలువైన షేర్లు ఉన్నాయి.

నవీన్ యాదవ్‌కు స్కోడా కారు ఉంది. తన భార్య పేరిట హుందాయ్ ఐ10 కారు ఉంది. ఆయన వద్ద 11 తులాల బంగారం, తన భార్య పేరున రెండు కేజీల బంగారం, 15 కిలోల వెండి ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు.

నవీన్ యాదవ్ పేరుమీద 14.39 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. యూసుఫ్ గూడలో 860 గజాల ఇంటి స్థలం ఉంది. ఆయన భార్య పేరుతో 4.30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 466 గజాల స్థలంలో ఇళ్లు ఉన్నాయి.