బీఆర్ఎస్‌ నేత రాకేశ్ రెడ్డికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీసులు

వారం రోజుల్లో సమాధానం ఇచ్చి, క్షమాపణలు చెప్పాలని టీజీపీఎస్సీ డిమాండ్ చేసింది.

బీఆర్ఎస్‌ నేత రాకేశ్ రెడ్డికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీసులు

Rakesh Reddy

Updated On : April 12, 2025 / 3:52 PM IST

బీఆర్ఎస్‌ నేత రాకేశ్ రెడ్డికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరువునష్టం దావా నోటీసులు పంపింది. గ్రూప్ 1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పింది. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి, క్షమాపణలు చెప్పాలని టీజీపీఎస్సీ డిమాండ్ చేసింది.

వారం రోజుల్లో సమాధానం చెప్పకపోతే పరువునష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించింది. టీజీపీఎస్సీపై ఎలాంటి ఆరోపణలు చేయొద్దని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టకూడదని తెలిపింది.

Also Read: చిరంజీవి, రామ్‌చరణ్‌ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ప్రెషర్‌ కుక్కర్‌ను తీసుకెళ్తారు.. ఎందుకో చెప్పేసిన ఉపాసన

కాగా, ఇటీవల రాకేశ్ రెడ్డి హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రూప్‌-1 మెయిన్‌ అన్ని పేపర్లను రీవాల్యుయేషన్‌ చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణతో పాటు వాల్యుయేషన్‌లో తప్పిదాలు జరిగాయని ఆరోపించారు.

వాటిని టీజీపీఎస్సీ సరిదిద్దుకోవాలని అన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. మొత్తం 45 సెంటర్లలో ఎగ్జామ్స్‌ నిర్వహిస్తే, వాటిలో 10, 15 సెంటర్లలోని అభ్యర్థులే టాపర్లుగా నిలిచారని అన్నారు. మరి, మిగతా సెంటర్లలో ఎందుకు రాలేదని నిలదీశారు.