Wife Kills Husband : కోకాపేట్‌లో దారుణం.. కూరగాయల కత్తితో రప్పారప్పా పొడిచి.. భర్తను చంపిన భార్య.. అర్ధరాత్రి జరిగిన ఆ ఘటన వల్లే..
Wife Kills Husband : కోకాపేట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూరగాయల కత్తితో భర్తను భార్య హత్య చేసింది.

Wife Killed Husband
Wife Kills Husband : రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూరగాయల కత్తితో భర్తను భార్య హత్య చేసింది. పోలీసులు కేసు నమోదుచేసి భార్యను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
జీవితాంతం కలిసి ఉంటామని వివాహ బంధంతో ఒక్కటైన జంటలు క్షణికావేశాలతో తమ జీవితాలను ఆగం చేసుకుంటున్నాయి. భార్యాభర్తల మధ్య సంబంధాలు రానురాను క్షీణించిపోతున్నాయి. అక్రమ సంబంధాలతో హత్యలు జరుగుతుండగా.. చిన్నచిన్న గొడవుల సమయంలో క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా.. కోకాపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తను భార్య కూరగాయల కత్తితో పొడిచి చంపేసింది.
Also Read: తొమ్మిదో తరగతి బాలుడికి బర్త్‌డే బంప్స్ ఇచ్చిన తోటి విద్యార్థులు.. ఆ తర్వాత..
అస్సాంకు చెందిన కృష్ణజ్యోతి బోరా, భరత్ బోరాలు హైదరాబాద్ శివారులోని కోకాపేట్ లో నివాసం ఉంటున్నారు. కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే, కొంతకాలంగా భార్య కృష్ణ జ్యోతిని భర్త భరత్ బోరా వేధింపులకు గురిచేస్తున్నాడు. మద్యం సేవించి ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరుగుతుండేవి.
గురువారం రాత్రి చిన్న విషయానికి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ కాస్త పెద్దదిగా కావడంతో కృష్ణజ్యోతి ఆగ్రహంతో విచక్షణారహితంగా కూరగాయల కత్తితో భర్తపై దాడి చేసింది. కత్తితో భర్తను పలుసార్లు పొడవడంతో.. భరత్ బోరా కేకలు వేస్తూ కిందపడిపోయాడు. అతని అరుపులు విన్న స్థానికులు ఇంటిలోపలికి వచ్చి చూడగా.. అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు. స్థానికులు హుటాహుటీన అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రి తతరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భరత్ బోరా మృతి చెందాడు.
భర్త వేధింపులు తాళలేకనే కత్తితో దాడిచేసినట్లు కృష్ణ జ్యోతి బోరా తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.