Mancherial : భర్తను స్తంభానికి కట్టేసి చితకబాదిన భార్య.. ఎందుకు ?
ఓ భార్య..తన భర్తను కరెంటు స్తంభానికి కట్టేసింది. ఎడపెడా కొట్టింది. సొంత భర్త అని చూడకుండా..చితకబాదింది. ఆమె కాళికావతారం చూసిన భర్త..భయపడిపోయాడు. అసలు ఎందుకిలా చేసిందో....

Wife
Wife Punished Drunken Husband : ఓ భార్య..తన భర్తను కరెంటు స్తంభానికి కట్టేసింది. ఎడపెడా కొట్టింది. సొంత భర్త అని చూడకుండా..చితకబాదింది. ఆమె కాళికావతారం చూసిన భర్త..భయపడిపోయాడు. అసలు ఎందుకిలా చేసిందో ఎవరికి అర్థం కాలేదు. కానీ..అక్కడున్న స్థానికులకు మాత్రం తెలుసు. భర్తకు మంచిగానే బుద్ధి చెప్పింది అనుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో చోటు చేసుకుంది. నిత్యం భర్త తాగుతూ..వచ్చి.. హింసిస్తుండడంతో ఆమె తట్టుకోలేకపోయింది. అందుకే అతడిని కరెంటు స్తంభానికి కట్టేసి చితకబాదింది.
Read More : TTD News: జనవరి 27 నుంచి అందుబాటులోకి టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు
వివరాల్లోకి వెళితే…
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గంబాల బస్తీలో తోపేల తిరుపతి, శారద దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి వయస్సు వచ్చిన కూతురు కూడా ఉంది. కానీ…తిరుపతి మద్యానికి బానిసయ్యాడు. ఏ పని చేయక భార్య సంపాదనపై ఆధారపడ్డాడు. శారద పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ప్రతి రోజు తాగి వస్తూ..ఆమెపై చేయి చేసుకొనే వాడు. హింసించడం మొదలు పెట్టాడు. నిత్యం తాగొచ్చి భార్య, పిల్లలతో గొడవ పడేవాడు. మారుతాడని అన్నీ భరించింది. అయితే…ఆదివారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కూతరుపై చేయి చేసుకున్నాడు. దీనిని చూసిన శారద తట్టుకోలేక పోయింది. వెంటనే ఇంట్లో ఉన్న తాళ్లతో భర్తను కరెంటు స్తంభానికి కట్టేసింది. చితకబాది. చివరకు భర్తకు కట్టేసిన తాళ్లను విప్పేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.