TikTok : టిక్‌టాక్‌ మోజులో భార్య.. భర్త ఆత్మహత్య

టిక్ టాక్ మోజులో పడి భర్తను కోల్పోయింది ఓ మహిళ ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. భర్త ఎంత చెప్పిన భార్య వినకపోవడంతో చివరకు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

TikTok : టిక్‌టాక్‌ మోజులో భార్య.. భర్త ఆత్మహత్య

Tiktok (2)

Updated On : July 11, 2021 / 8:16 PM IST

TikTok : ప్రజలపై సోషల్ మీడియా ప్రభావం చాలానే ఉంది. మానవాళి జీవనంలో సోషల్ మీడియా ఓ భాగమై పోయింది. సంతోషాలు, బాధలను పంచుకోవడంతోపాటు, కాలక్షేపం చేసేందుకు వేదికగా మారింది. అయితే దీని వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకు మించి అనర్దాలు ఉన్నాయనడంలో సందేహించాల్సిన అవసరం లేదు. గేమ్స్, షార్ట్ వీడియో యాప్స్ వచ్చిన తర్వాత కొందరికి ఇంట్లో వారితో మాట్లాడే తీరికకూడా లేకుండా పోయింది. సోషల్ మీడియాకు బానిసలై సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు.

తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ ఘటన మనుషుల జీవితాల్లోకి సోషల్ మీడియా ఎంత లోతుకు చొచ్చుకు పోయిందో అని చెప్పేందుకు నిదర్శంగా నిలిచింది. సనత్ నగర్ సమీపంలోని ఫతేనగర్‌లో నివాసం ఉండే పవన్ నీమ్కార్, ప్రియాంక నీమ్కార్ లకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం వరకు బాగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు ప్రియాంక అలవాటు పడిపోయింది. ఇది రాను రాను ఎక్కువైంది. రాత్రికిరాత్రే టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ వచ్చింది.

ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతున్న కొద్దీ సోషల్ మీడియాకు ఎక్కువ సమయం కేటాయించింది. అది గమనించిన భర్త పవన్.. ఆమెను పలుమార్లు మందలించాడు. కొద్దీ సార్లు ఇదే విషయంలో ఘర్షణ కూడా పడ్డారని స్థానికులు చెబుతున్నారు. అయితే భార్య ఎంత చెప్పినా వినకపోవడంతో ఆదివారం ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు పవన్.

తన కుమారుడు పవన్ మృతికి కోడలు ప్రియాంకనే కారణమని పవన్ తల్లి బాలానగర్ డీసీపీ పద్మజకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై లిఖిత పూర్వక ఫిర్యాదు పోలీసు స్టేషన్‌లో సమర్పించారు.