Komatireddy Raj Gopal Reddy : ఆట ఇప్పుడే మొదలైంది, కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదు, జైలుకెళ్లక తప్పదు- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
కేసీఆర్ కుటుంబ పాలనను గద్దె దించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే సాధ్యం. Komatireddy Raj Gopal Reddy - CM KCR

Komatireddy Raj Gopal Reddy - CM KCR (Photo : Google)
Komatireddy Raj Gopal Reddy – CM KCR : ఆట ఇప్పుడే మొదలైంది.. సీఎం కేసీఆర్ ను వదిలిపెట్టేది లేదు.. జైలుకెళ్లక తప్పదు అంటూ హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తప్పు చేసింది ఎవరైనా సరే జైలుకెళ్లక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ కు మినహాయింపు లేదని తేల్చి చెప్పారు. మునుగోడులో తనను ఓడించడానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
నల్గొండ బీజేపీ కార్యాలయంలో అసెంబ్లీల నియోజకవర్గస్థాయి కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద్భంగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
Also Read.. Karimnagar: కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సింహం సింబల్ హవా.. ఎందుకో తెలుసా?
”రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబ పాలనను గద్దె దించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే సాధ్యం. మోడీ, అమిత్ షా నాయకత్వంలోనే మళ్లీ ప్రజాస్వామాన్ని కాపాడి నీతివంతమైన పాలన అందించాలని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణ ప్రజల మనసులో ఉన్న ఆలోచనను విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ మైండ్ గేమ్ ట్రాప్ లో పడొద్దు.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని చెప్పి ప్రజల్లో బద్నాం చేసేది బీఆర్ఎస్ పార్టీ వాళ్లే. బీజేపీని చూస్తే బీఆర్ఎస్ వాళ్లకు వణుకు పుడుతుంది. రాష్ట్రంలో నీతివంతమైన పాలన అందించాలంటే బీజేపీతోనే సాధ్యం. దేశ అభివృద్ధి, దేశ సమగ్రత, దేశ రక్షణ మోదీ-అమిత్ షా నాయకత్వంతోనే సాధ్యం. నల్గొండ జిల్లాలో బీజేపీని బలోపేతం చేస్తాం. కాషాయ జెండా ఎగరేస్తాం.
అవినీతికి పాల్పడిన మనీష్ సిసోడియా జైలు పాలయ్యాడు. తప్పు చేసింది ఎవరైనా సరే జైలుకెళ్ళక తప్పదు. సీఎం కేసీఆర్ కు కూడా మినహాయింపు కాదు. కేసీఆర్ చేసిన అవినీతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆట ఇప్పుడే మొదలైంది. మునుగోడలో నన్ను ఓడించడానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం” అని విశ్వాసం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి.
Also Read..Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో హాట్‌హాట్‌గా మారిన ఫ్యామిలీ పాలిటిక్స్!
తరుణ్ చుగ్ కామెంట్స్..
బీజేపీని అధికారంలో కూర్చోబెట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్.. బీఆర్ఎస్ పార్టీకి బీ-టీమ్ గా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ విపక్షంలోనే కూర్చోబోతున్నాయి.