Wine Shops Closed: ఆ రెండు రోజులు హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్.. కారణమేమంటే

సిటీ పోలీస్ కమిషనరేట్‌లోని సౌత్ జోన్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ డివిజన్ పరిధిలో రెండు రోజులు వైన్ షాపులు బంద్ కానున్నాయి.

Wine Shops Closed: ఆ రెండు రోజులు హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్.. కారణమేమంటే

Wine shops closed

Updated On : July 14, 2023 / 12:47 PM IST

Wine Shops: హైదరాబాద్‌ (Hyderabad) లో బోనాల సందడి నెలకొంది. ఆదివారం బోనాల పండుగ ( Bonala festival) ను ఘనంగా నిర్వహించేందుకు పలు ప్రాంతాల్లోని నగర వాసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 16, 17 తేదీల్లో మద్యం షాపులు బంద్ (Wine Shops Closed)  కానున్నాయి. ఈనెల 16వ తేదీన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు బంద్ అవుతాయి.

ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం (17వ తేదీ) ఉదయం 6గంటల వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి జోన్ (మల్కాజిగిరి, కుషాయిగూడ డివిజన్లు), ఎల్బీ‌నగర్ జోన్ (వనస్థలిపురం డివిజన్), మహేశ్వరం జోన్ (మహేశ్వరం డివిజన్) పరిధిలో ఒకరోజు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆయా కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

WI vs IND 1st Test : ఫోర్ కొట్టి సంతోషాన్ని వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ.. ఆ ఫోర్ ప్రత్యేకతేమిటో తెలుసా? వీడియో వైరల్ ..

అదేవిధంగా సిటీ పోలీస్ కమిషనరేట్‌లోని సౌత్ జోన్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ డివిజన్ పరిధిలో రెండు రోజులు అంటే 16వ తేదీ ఉదయం 6గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6గంటల వరకు రెండు రోజులపాటు మద్యం దుకాణాలు మూసి వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ఆంక్షలు ఆదివారం అమల్లో ఉండనున్నాయి.