Oxygen Shortage: ఆక్సిజన్ అందక ఊపిరి ఆగింది.
ఆక్సిజన్ అందక మహిళ మృతి చెందింది. ఆరు ఆసుపత్రులు తిరిగినా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం అంబులెన్స్ లోనే తుదిశ్వాస విధించింది.. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని బ్రాహ్మణబస్తీకి చెందిన శేషాచార్యులు, పుష్పవల్లి దంపతులకు ముగ్గురు కుమారులు.

Oxygen Shortage
Oxygen Shortage: ఆక్సిజన్ అందక మహిళ మృతి చెందింది. ఆరు ఆసుపత్రులు తిరిగినా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం అంబులెన్స్ లోనే తుదిశ్వాస విధించింది.. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని బ్రాహ్మణబస్తీకి చెందిన శేషాచార్యులు, పుష్పవల్లి దంపతులకు ముగ్గురు కుమారులు. ఐదుగురు కుమార్తెలు. మూడో కుమార్తె అనిత అనారోగ్యానికి గురైంది.. కరోనా పరీక్షలు చేయిస్తే నెగటివ్ అని వచ్చింది.
కుటుంబంతో కలిసి బెంగళూరులో ఉంటున్న అనిత.. కరోనా నెగటివ్ రావడంతో 21 తేదీ కారులో సికింద్రాబాద్ లోని తల్లిగారి ఇంటికి వచ్చింది. 22 తేదీ సాయంత్రం శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తింది. దీంతో ఆమెను అంబులెన్స్ లో తీసుకోని కమల ఆస్పత్రి, యశోద, ఓమ్ని, గ్లోబల్, నక్షత్ర ఆస్పత్రులకు వెళ్లగా అక్కడ ఆక్సిజన్ బెడ్లు ఖాళీ లేవని వెనక్కు పంపారు. ఎల్బీ నగర్ లోని ఓజోన్ ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ ఉన్నాయని తెలియడంతో అక్కడికి వెళ్లారు. ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కాగా వారం రోజుల క్రితమే అనిత సోదరి ఇదే సమస్యతో మృతి చెందారు.
అనిత సోదరి కల్యాణి (51) ఏప్రిల్ 16న స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను అనేక ఆసుపత్రులు తిప్పారు. ఎక్కడ బెడ్లు దొరకలేదు. చేసేదేమి లేక ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అదే రోజు ఆమె మృతి చెందారు. వారం రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే వీరిద్దరూ చనిపోయారని మృతుల సోదరులు విజయసారథి, వేణుగోపాల్ ఆరోపించారు