Kavitha: కేజీఎఫ్‌లోకి వెళ్లినట్లు ఆంక్షలా? వాళ్లను వదిలిపెట్టను.. చింతమడకలో కవిత మాస్ వార్నింగ్
చంద్రుడి లాంటి కేసీఆర్ కు మచ్చ తెచ్చేందుకు ప్రయత్నించారని, అలా చేసే వారిని..

Kavitha
Kavitha: సిద్ధిపేట జిల్లా చింతమడకలో కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. సిద్ధిపేట రావాలంటే కేజీఎఫ్ లోకి వెళ్లినట్లు ఆంక్షలు పెట్టారన్న కవిత.. సిద్ధిపేటలో ఎవరి ఆంక్షలు పని చేయవన్నారు. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువగా వస్తారని అన్నారు. చంద్రుడి లాంటి కేసీఆర్ కు మచ్చ తెచ్చేందుకు ప్రయత్నించారని, అలా చేసే వారిని వదిలిపెట్టేది లేదన్నారు. కుటుంబానికి దూరమైన బాధలో ఉన్నానన్న కవిత.. తన కుటుంబంపై కుట్ర చేసిన వాళ్ల భరతం పడతానని వార్నింగ్ ఇచ్చారు.
”సిద్ధిపేట రావాలన్నా, చింతమడక రావాలన్నా.. అదేదో ప్రైవేట్ ప్రాపర్టీలాగా, కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజుకి కూడా ఆ ఆంక్షలు ఉన్నాయి. ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ. కేసీఆర్ ను కన్న గడ్డ. ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కేర్ చేయం. ఇవాళ ఊరు ఊరంతా కలిసి వచ్చి బతుకమ్మ పండగ చేసుకోవడమే అందుకు సాక్ష్యంగా నేను భావిస్తున్నా” అని కవిత అన్నారు.
Also Read: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..