Yadadri : యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం

యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత పేర్కొన్నారు. కాగా ఆగస్టు15న శ్రీవారి ఖజానాకు రూ. 27,75,203 ఆదాయం సమాకూరింది.

Yadadri : యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం

Yadadri (1)

Updated On : August 18, 2021 / 8:15 PM IST

Yadadri Srivari treasury : యాదాద్రి శ్రీవారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత పేర్కొన్నారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 47,864, రూ. 100 దర్శనంతో రూ. 33,000, నిత్య కైంకర్యాలతో రూ. 1,800, సుప్రభాతం ద్వారా రూ. 300, క్యారీ బ్యాగులతో రూ. 1,650, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 84,000, కళ్యాణకట్టతో రూ. 20,000, ప్రసాద విక్రయంతో రూ. 3,04,950 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

అలాగే శాశ్వత పూజలతో రూ. 6,000, వాహన పూజల ద్వారా రూ. 8,500, టోల్ గేట్‌తో రూ. 900, అన్నదాన విరాళంతో రూ. 11,312, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 85,980, యాదరుషి నిలయంతో రూ. 66,070, పాతగుట్టతో రూ. 29,715, టెంకాయల విక్రయాలతో రూ. 39,000లతో కలుపుకుని శ్రీవారి ఖజానాకు మొత్తం రూ. 7,41,041 ఆదాయం సమకూరినట్లు గీత తెలిపారు.

ఆగస్టు15న శ్రీవారి ఖజానాకు రూ. 27,75,203 ఆదాయం సమాకూరింది. ప్రధాన బుకింగ్‌తో రూ. 4,56,890, రూ. 100 దర్శనంతో రూ. 30, 900, వీఐపీ దర్శనాలతో రూ. 4,05,000, నిత్య కైంకర్యాలతో రూ. 6,002, సుప్రభాతం ద్వారా రూ. 2,600, క్యారీబ్యాగులతో రూ. 3,600, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 1,40,000, కల్యాణకట్టతో రూ. 54,400 ఆదాయం వచ్చింది.

ప్రసాద విక్రయంతో రూ. 11,39,415, శాశ్వత పూజల ద్వారా రూ. 47,160, వాహన పూజల తో రూ. 27,100, టోల్‌గేట్‌తో రూ. 1,420, అన్నదాన విరాళంతో రూ. 31,591, సువ ర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,50,100, యాదరుషి నిలయంతో రూ. 89,260, పాతగుట్టతో రూ. 83,665, టెంకాయల విక్రయాలతో రూ. 1,05,000 తో కలుపుకుని మొత్తం రూ. 27,75,203 ఆదాయం సమకూరింది.