Young Man Died : ఖమ్మంలో గుండె పోటుతో యువకుడు మృతి.. జిమ్ కు వెళ్లి వచ్చిన కొద్ది సేపటికే..

ఖమ్మంలోని బాలాపేట్ చెందిన శ్రీధర్ ఉదయం జిమ్ కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతను ఇంట్లోనే కుప్పకూలి పోయాడు.

Young Man Died : ఖమ్మంలో గుండె పోటుతో యువకుడు మృతి.. జిమ్ కు వెళ్లి వచ్చిన కొద్ది సేపటికే..

young man died

Updated On : July 10, 2023 / 4:17 PM IST

Khammam Heart Attack : ఖమ్మంలో విషాదం చోటుచేసుకుంది. గుండె పోటుతో యువకుడు మృతి చెందాడు. జిమ్ కు వెళ్లి వచ్చిన కొద్ది సేపటికే యువకుడు చనిపోయారు. నగరానికి చెందిన శ్రీధర్ అనే 25 ఏళ్ల యువకుడు గుండె పోటుతో మృతి చెందాడు. జిమ్ కు వెళ్లి వచ్చిన కొద్ది సేపటికే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

శ్రీధర్ తండ్రి మానుకొండ రాధకిశోర్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పని చేస్తున్నారు. ఆదివారం సోదరుడి కుమారుడి బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ ఆనందం మరువక ముందే ఇంట్లో విషాదం నెలకొంది.

Heart Attack : క్రికెట్ ఆడుతూ గుండె పోటుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

ఖమ్మంలోని బాలాపేట్ కు చెందిన శ్రీధర్ ఉదయం జిమ్ కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతను ఇంట్లోనే కుప్పకూలి పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు శ్రీధర్ ను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే శ్రీధర్ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించాడు. గుండెపోటుతోనే శ్రీధర్ మృతి చెందినట్లు పేర్కొన్నారు. గతంలో శ్రీధర్ ఓ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందాడు. శ్రీధర్ మృతి పట్ల పలువురు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.