Video: గుడిలో ప్రదక్షిణలు చేస్తూ.. గుండెపోటుతో మృతి చెందిన యువకుడు
విష్ణువర్ధన్ గుడిలో ప్రదక్షిణలు చేస్తూనే కుప్పకూలిపోయిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి కెమెరాకు చిక్కాయి.

గుడిలో ప్రదక్షిణలు చేస్తూ అక్కడే ప్రాణాలు వదిలాడు ఓ యువకుడు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో పీజీ హాస్టల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు కానంపల్లి విష్ణువర్ధన్ (31) అనే యువకుడు.
విష్ణువర్ధన్ సోమవారం టెంపుల్ బస్ స్టాప్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లాడు. ప్రదక్షిణలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి భక్తులు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
అయితే, అప్పటికే గుడిలోనే అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విష్ణువర్ధన్ గుడిలో ప్రదక్షిణలు చేస్తూనే కుప్పకూలిపోయిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి కెమెరాకు చిక్కాయి. విష్ణువర్ధన్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విష్ణువర్ధన్ మృతి గురించి అతడి సోదరుడికి సమాచారం అందింది.
ఆలయంలో వ్యక్తి గుండెపోటుతో మృతి
కేపీహ్చ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. pic.twitter.com/tDYUELOJyP
— ChotaNews (@ChotaNewsTelugu) November 12, 2024