Viral Video: ‘చోర్.. చోర్’ అంటూ నినాదాలు.. అమెరికాలో కాలు పెట్టగానే పాకిస్థాన్ మంత్రికి చేదు అనుభవం
అమెరికాలో కాలు పెట్టగానే పాకిస్థాన్ కొత్త ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ కు చేదు అనుభవం ఎదురైంది. వాషింగ్టన్ విమానాశ్రయంలో దిగిన ఆయనను చూసిన వెంటనే నిరసనకారులు ‘చోర్.. చోర్’.. ‘అబద్ధాలకోరు’.. అంటూ నినాదాలు చేశారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నిర్వహిస్తున్న సమావేశాలకు ఆయన హాజరు కావడానికి అమెరికాకు వెళ్లారు. విమానాశ్రయంలో నిరసనకారులు నినాదాలు చేయడంతో ఇషాక్ దార్ అనుచరుల్లో ఒకరు వారిపై విరుచుకుపడ్డారు.

Viral Video: అమెరికాలో కాలు పెట్టగానే పాకిస్థాన్ కొత్త ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ కు చేదు అనుభవం ఎదురైంది. వాషింగ్టన్ విమానాశ్రయంలో దిగిన ఆయనను చూసిన వెంటనే నిరసనకారులు ‘చోర్.. చోర్’.. ‘అబద్ధాలకోరు’.. అంటూ నినాదాలు చేశారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నిర్వహిస్తున్న సమావేశాలకు ఆయన హాజరు కావడానికి అమెరికాకు వెళ్లారు. విమానాశ్రయంలో నిరసనకారులు నినాదాలు చేయడంతో ఇషాక్ దార్ అనుచరుల్లో ఒకరు వారిపై విరుచుకుపడ్డారు.
నిరసనకారులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పాకిస్థాన్ మంత్రులకు ఇలా విదేశాల్లో చేదు అనుభవాలు తరుచూ ఎదురవుతున్నాయి. పాక్ సమాచార శాఖ మంత్రి మరియమ్ కు గత నెల లండన్ లో కాఫీ షాపులో ఇటువంటి అనుభవమే ఎదురైంది. అంతకుముందు కూడా పలుసార్లు పాక్ మంత్రులకు చేదు అనుభవాలు ఎదురైన ఘటనలు ఉన్నాయి.
لندن میں تو یہ معمول ہے۔ یہ تو امریکہ میں بھی وہی ہورہا ہے۔ pic.twitter.com/Z34WSxDr5G
— Ihtisham Ul Haq (@iihtishamm) October 13, 2022