Pomegranate : చర్మ సౌందర్యాన్ని పెంచటంతోపాటు, జిడ్డును, మలినాలను తొలగించే దానిమ్మ!

దానిమ్మ గింజలను మెత్తగా పేస్ట్ చేసి అందులో కోకో పౌడర్‌ను కలపాలి. ఈ పేస్టులని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వృద్ధాప్యం ఆగిపోతుంది. దీన్ని వారానికి 3 సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మం బిగుతుగా, యవ్వనంగా మారుతుంది.

Pomegranate : చర్మ సౌందర్యాన్ని పెంచటంతోపాటు, జిడ్డును, మలినాలను తొలగించే దానిమ్మ!

Pomegranate

Updated On : December 29, 2022 / 10:32 AM IST

Pomegranate : దానిమ్మ పండులో పోషకాలు అధికంగా ఉంటాయి. దానిమ్మ పండులో విటమిను-ఎ, సి, ఇ, బి-5లు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ సౌందర్య ఉత్పత్తిగా కూడా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సితోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఉంటాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

చర్మ సౌందర్యానికి దానిమ్మ ;

చర్మానికి దానిమ్మ ఉపయోగకరమైనదని నిపుణులు చెబుతున్నారు. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించి, చర్మ సమస్యలను తగ్గించి అందాన్ని మెరుగుపరుస్తుంది. దానిమ్మలో ఉండే నూనెలు, ఎపిడేర్మల్ కణాలకు శక్తిని అందించి, చర్మంపై కలిగే ముడతలను పోగొడతాయి. అకాల వృద్ధాప్యాన్ని ఆపే ఆహార పదార్థాలలో దానిమ్మకు ప్రత్యేక స్ధానం ఉంది. ముడతలను మరియు గీతాలను దానిమ్మ పండు తగ్గిస్తుంది. జిడ్డు చర్మంపై కలిగే మొటిమలను, చర్మ పగుళ్ళను, మచ్చలు మరియు దురదలను పోగొడుతుంది.

చర్మ కణాలలో ఉండే బ్యాక్టీరియా మరియు మలిన పదార్థాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో దానిమ్మ బాగా ఉపయోగపడుతుంది. సూర్యకాంతి వలన కలిగే ప్రమాదాలను, ఫ్రీ రాడికల్ ల వలన చర్మంపై కలిగే ఇబ్బందులను, చర్మ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను కూడా తగ్గించే శక్తి దీనికి ఉంది. మంటలను మరియు వాపులను శక్తివంతంగా తగ్గిస్తుంది.

దానిమ్మతో చర్మ సౌందర్యానికి చిట్కాలు ;

1. దానిమ్మ గింజలను మెత్తగా పేస్ట్ చేసి అందులో కోకో పౌడర్‌ను కలపాలి. ఈ పేస్టులని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వృద్ధాప్యం ఆగిపోతుంది. దీన్ని వారానికి 3 సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మం బిగుతుగా, యవ్వనంగా మారుతుంది.

2. దానిమ్మ గింజలను మెత్తగా చేసుకుని దానికి రెండు చెంచాల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ గ్రీన్ టీ వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 30 నిమిషాల పాటు మర్దన చేసి కడిగేయాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమల సమస్య తొలగిపోతుంది.

3. కొత్త కణాల ఏర్పాటుకు దానిమ్మపండు సహాయపడుతుంది. మార్కెట్లలో లభించే దానిమ్మ నూనెను సేకరించి ప్రతిరోజూ ముఖం మీద పూయాలి. వారంలో నే మార్పును గమనించవచ్చు. దీని వల్ల చర్మం మృదువుగా మరియు దృఢంగా అనుభూతి చెందుతారు.