Chhattisgarh encounter: కాల్పులతో దద్దరిల్లిన అటవీ ప్రాంతం.. 31 మంది మావోయిస్టులు మృతి
బస్తర్ ఐజీ పీ సుందర్‌రాజ్ మీడియాకు వివరాలు తెలిపారు.

Maoists
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 31 మంది మావోయిస్టులు మృతి చెందారని బస్తర్ ఐజీ పీ సుందర్‌రాజ్ తెలిపారు.
మావోయిస్టుల ఇంకా గాలింపు కొనసాగుతోంది. డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా టీమ్స్ ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్ ఛత్తీస్‌గఢ్ చరిత్రలోనే రెండో భారీ ఎన్‌కౌంటర్. గతంలో ఎన్‌కౌంటర్‌లో 41 మంది మావోయిస్టులు మృతి చెందారు.
పశ్చిమ బస్తర్ ప్రాంతంలో ఇటీవల మావోయిస్టుల గురించి భద్రతా దళాలకు సమాచారం అందడంతో ఇవాళ ఉదయం ఇంద్రావతీ నేషనల్ పార్క్ ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టులు కాల్పులకు తెగబడడంతో భద్రతా దళాలు తిప్పికొట్టాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందినట్లు సమాచారం. అంతేగాక మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
కాగా, వచ్చే ఏడాది నాటికి మావోయిస్టులను తుడిచిపెడతామని గత నెలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు చేపడుతున్న ఆపరేషన్లలో వరుసగా కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.
మీర్‌పేట్ మాధవి కేసులో భారీ ట్విస్ట్.. ఇంతకాలం గురుమూర్తి ఒక్కడే అనుకున్నారు.. కానీ..