Chilling Video: జింకను వేటాడిన చిరుత పులి వీడియో వైరల్

Chilling Video: జింకను వేటాడిన చిరుత పులి వీడియో వైరల్

Updated On : December 18, 2022 / 2:16 PM IST

Chilling Video: చిరుతపులి వేట అంటే ఎలా ఉంటుందో తెలిపే వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి రమేశ్ పాండే ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అడవిలో ఓ చెట్టు వద్ద ఉన్న జింకను చిరుతపులి చూస్తుంది. జింక వద్దకు మెల్లిమెల్లిగా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది.

ఆ సమయంలో చిరుతపులి చూపిన నైపుణ్యాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. మొదట ఇసుక వెనుక దాక్కున్న ఆ చిరుతపుల్లి.. జింకకు కనపడకుండా మెల్లిగా ముందుకు వెళ్తుంది. ముందుకు కదులుతున్న సంగతి కూడా జింక గమనించకుండా చిరుతపులి జాగ్రత్త పడుతుంది. అనంతరం ఆ చిరుత పులి చెట్టువెనకాలకు వెళ్తుంది.

జింక కొన్ని అడుగుల దూరంలో ఉన్న సమయంలో మెరుపు వేగంతో పరుగులు తీసి దాన్ని పట్టుకుంది చిరుతపులి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి రమేశ్ పాండే ఈ వీడియోను పోస్టు చేసిన 24 గంటల్లోనే 45,000 మంది చూశారు. చిరుతపులి లక్ష్యసాధనలో చూపిన నైపుణ్యాలను నెటిజన్లు అభినందించకుండా ఉండలేకపోతున్నారు.

Mrunal Thakur : సిల్వర్ డ్రెస్‌లో మిలమిల మెరిసిపోతున్న మృణాల్..