HDFC Scholarship: విద్యార్థులకు గుడ్ న్యూస్.. హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ ఉంటే రూ.75 వేల స్కాలర్‌షిప్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు

HDFC Scholarship: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 1వ తరగతి నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేట్ వరకు ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్ అందించనుంది.

HDFC Scholarship: విద్యార్థులకు గుడ్ న్యూస్.. హెచ్‌డీఎఫ్‌సీ అకౌంట్ ఉంటే రూ.75 వేల స్కాలర్‌షిప్.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు

HDFC Parivartan 75 thousand scholarship for economically backward students

Updated On : July 28, 2025 / 5:12 PM IST

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 1వ తరగతి నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేట్ వరకు ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్ అందించనుంది. ఈ మేరకు ECSS స్కాలర్‌షిప్ 2025-26 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమం ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయం అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది. దీనికి ఎంపికైన విద్యార్థులకు రూ.75,000 వరకు ఆర్థిక సహాయం లభించనుంది. కాబట్టి విద్యార్థులు తప్పుకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సెప్టెంబర్ 04, 2025 వరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత వివరాలు:

  • భారత పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • 1వ తరగతి నుంచి డిప్లొమా, ఐటిఐ, పాలిటెక్నిక్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న విద్యార్థులందరు దరఖాస్తు చేయవచ్చు.
  • చివరిగా రాసిన అర్హత పరీక్షలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి.
  • అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.

స్కాలర్షిప్ వివరాలు:

ఈ స్కీంకు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు స్కాలర్‌షిప్ రూపంలో రూ.75,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది

  • 1 నుంచి 6వ తరగతి వరకు రూ.15,000
  • 7 నుంచి 12/ డిప్లొమా / ఐటిఐ వరకు రూ.18,000
  • BA, B.Com చదువుతున్నవారికి రూ.30,000
  • ఇంజనీరింగ్, MBBS చదువుతున్న వారికి రూ.50,000
  • జనరల్ పీజీ చదువుతున్నవారికి రూ.35,000
  • MBA, M.Tech చేస్తున్న వారికి రూ.75,000

వరకు ఆర్ధిక సహాయం అందిస్తారు. అది కూడా విద్యార్థులు వ్యక్తిగత ఖాతాల్లో మాత్రమే జమ చేయడం జరుగుతుంది.