India-US: భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఉండాల్సినంత బలంగా లేవు: అమెరికా కాంగ్రెస్ సభ్యుడు
భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఉండాల్సినంత బలంగా లేవని భారత సంతతి నేత, అగ్రరాజ్య కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థనేదర్ (67) అన్నారు. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు, ప్రజలకు ఉపయోగపడేలా భారత్-అమెరికా మధ్య బంధాన్ని బలపర్చేందుకు తాను పనిచేస్తానని చెప్పారు. మిచిగాన్ నుంచి శ్రీ థనేదర్ అమెరికా కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Thousands Of Indian IT Professionals Struggle To Stay In US
India-US: భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఉండాల్సినంత బలంగా లేవని భారత సంతతి నేత, అగ్రరాజ్య కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థనేదర్ (67) అన్నారు. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు, ప్రజలకు ఉపయోగపడేలా భారత్-అమెరికా మధ్య బంధాన్ని బలపర్చేందుకు తాను పనిచేస్తానని చెప్పారు. మిచిగాన్ నుంచి శ్రీ థనేదర్ అమెరికా కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ప్రస్తుత అమెరికా కాంగ్రెస్ లో ఆయన ఐదో భారత సంతతి నేత, అమెరికా కాంగ్రెస్ లో మరో నలుగురు భారత సంతతి నేతలు అమి బేరా, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, ప్రమీలా జయపాల్ ఉన్నారు. తాజాగా, శ్రీ థనేదర్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్-అమెరికా మధ్య సహకారం మరింత పెరిగేలా కృషి చేస్తానని అన్నారు.
భారత్-అమెరికా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలని గుర్తుచేశారు. భారత్ ఓ పెద్ద ఆర్థిక శక్తి అని చెప్పారు. ప్రస్తుతం జీ-20కి నాయకత్వం వహిస్తుందని అన్నారు. భారత్ ఓ ఆర్థిక శక్తిగా ఉన్న నేపథ్యంలో అది అమెరికాకు కూడా లాభదాయకమని చెప్పారు. పరస్పర సత్సంబంధాలు బలంగా ఉంటే ఇరు దేశాలు చాలా లాభపడతాయని శ్రీ థనేదర్ అన్నారు.