IPL 2024 Auction : వేలం పూర్తి.. ఏ ఆట‌గాడు ఎంత‌కు అమ్ముడుపోయాడంటే..?

ఐపీఎల్ 2024 మినీ వేలం ముగిసింది.

IPL 2024 Auction : వేలం పూర్తి.. ఏ ఆట‌గాడు ఎంత‌కు అమ్ముడుపోయాడంటే..?

IPL 2024 Auction Live Updates

Updated On : December 19, 2023 / 9:04 PM IST

బేస్ ప్రైజ్‌కే ముజీబ్ రెహమాన్..
అఫ్గానిస్తాన్ ఆట‌గాడు ముజీబ్ రెహమాన్ బేస్‌ప్రైజ్ రూ.2 కోట్లు కాగా అదే ధ‌ర‌కు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ అత‌డిని సొంతం చేసుకుంది.

లాకీ ఫెర్గూసన్ బెంగ‌ళూరు సొంతం..
లాకీ ఫెర్గూసన్ రూ.2కోట్ల బేస్‌ప్రైస్‌తో వేలంలో అడుగుపెట్ట‌గా అదే ధ‌ర‌కు అత‌డిని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కొనుగోలు చేసింది.

రిలీ రోసో రూ.8 కోట్ల‌కు పంజాబ్ సొంతం..
బేస్‌ప్రైస్‌ రూ.2కోట్ల‌తో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు రిలీ రోసో వేలంలో అడుగుపెట్టాడు. అత‌డి కోసం పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు అత‌డిని పంజాబ్ కింగ్స్ రూ.8కోట్ల‌కు ద‌క్కించుకుంది.

రాబిన్ మింజ్‌కు రూ.3.6కోట్లు..
రాబిన్ మింజ్‌ను అదృష్టం వ‌రించింది. రూ.20ల‌క్ష‌ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి అడుగుపెట్టిన అత‌డి కోసం గుజ‌రాత్ టైటాన్స్‌, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు గుజ‌రాత్ టైటాన్స్ రూ.3.6 కోట్ల‌కు సొంతం చేసుకుంది.

సుమిత్ కుమార్ రూ.కోటీ..
రూ.20ల‌క్ష‌ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి అడుగుపెట్టిన సుమిత్‌కుమార్ కోసం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ లు పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు రూ.కోటికి ఢిల్లీ అత‌డిని సొంతం చేసుకుంది.

నువాన్ తుషారా ముంబై సొంతం..
శ్రీలంక పేస‌ర్ నువాన్ తుషారాను ముంబై ఇండియ‌న్స్ రూ.4.80 కోట్ల‌కు కొనుగోలు చేసింది.

జైల్ రిచర్డ్‌సన్‌కు రూ.5 కోట్లు..
బేస్‌ప్రైజ్ రూ.1.5 కోట్ల‌తో వేలంలో అడుగుపెట్టిన జైల్ రిచర్డ్‌సన్ కోసం ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌లు పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు అత‌డిని ఢిల్లీ రూ.5కోట్ల‌కు సొంతం చేసుకుంది.

ముస్తాఫిజుర్ రెహమాన్ చెన్నై సొంతం..
బంగ్లాదేశ్ ఆట‌గాడు ముస్తాఫిజుర్ రెహమాన్ రూ.2కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి రాగా అదే ధ‌ర వ‌ద్ద అత‌డిని చెన్నై సూప‌ర్ కింగ్స్ కొనుగోలు చేసింది.

స్పెన్సర్ జాన్సన్‌కు రూ.10కోట్లు..
ఆస్ట్రేలియా ఆట‌గాడు స్పెన్సర్ జాన్సన్ రూ.50ల‌క్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చాడు. అత‌డి కోసం గుజ‌రాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్లు పోటీప‌డ్డాయి. చివ‌ర‌కు అత‌డిని గుజ‌రాత్ టైటాన్స్ రూ.10కోట్ల‌కు సొంతం చేసుకుంది.

ల‌క్నోకు డేవిడ్ విల్లీ..
ఇంగ్లాండ్ ఆట‌గాడు డేవిడ్ విల్లీ రూ.2కోట్ల బేస్‌ప్రైజ్ వ‌ద్ద ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.

బెంగ‌ళూరుకు టామ్ కర్రాన్..
ఇంగ్లాండ్ ఆట‌గాడు టామ్ క‌ర్రాన్‌ను బెంగ‌ళూరు జ‌ట్టు బేస్‌ప్రైజ్ రూ.1.5కోట్ల వ‌ద్ద కొనుగోలు చేసింది

ఆస్ట‌న్ టర్నర్ ను కొనుగోలు చేసిన ల‌క్నో..
ఆసీస్ ఆట‌గాడు ఆస్ట‌ర్ ట‌ర్న‌ర్‌ను బేస్‌ప్రైజ్ రూ.కోటి వ‌ద్ద ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.

షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ కోల్‌క‌తా సొంతం
షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ను బేస్‌ప్రైజ్ రూ.1.5 కోట్ల వ‌ద్ద కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కొనుగోలు చేసింది.

శ్రేయాస్ గోపాల్‌ను ద‌క్కించుకున్న ముంబై..
రూ.20లక్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన శ్రేయాస్ గోపాల్‌ను అదే ధ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్ కొనుగోలు చేసింది.

సిద్ధార్థ్‌కు రూ.2.4కోట్లు..
రూ.20లక్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన సిద్ధార్థ్ పంట పండింది. అత‌డి కోసం ఫ్రాంచైజీలు పోటిప‌డ్డాయి. చివ‌ర‌కు రూ.2.40 కోట్ల‌కు ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ అత‌డిని సొంతంచేసుకుంది.

మానవ్ సుతార్ ను ద‌క్కించుకున్న గుజ‌రాత్..
రూ.20లక్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన మానవ్ సుతార్‌ని గుజ‌రాత్ టైటాన్స్ అదే ధ‌ర‌కు ద‌క్కించుకుంది.

రాసిఖ్ దార్ ఢిల్లీ సొంతం..
రూ.20లక్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన రాసిఖ్ దార్ ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ అదే ధ‌ర‌కు కొనుగోలు చేసింది.

కార్తీక్ త్యాగి గుజ‌రాత్ సొంతం..
రూ.20లక్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన కార్తీక్ త్యాగిని గుజ‌రాత్ టైటాన్స్ రూ.60ల‌క్ష‌ల‌కు ద‌క్కించుకుంది.

ఆకాష్ సింగ్ హైద‌రాబాద్ సొంతం..
రూ.20లక్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన ఆకాష్ సింగ్ను అదే ధ‌ర‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కొనుగోలు చేసింది.

సుశాంత్ మిశ్రాకు రూ.2.20కోట్లు..
రూ.20లక్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన సుశాంత్ మిశ్రాను రూ.2.20 కోట్ల‌కు గుజ‌రాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.

యశ్ దయాళ్‌కు రూ.5కోట్లు..
యువ బౌల‌ర్ య‌శ్ ద‌యాళ్ ను అదృష్టం వ‌రించింది. రూ.20ల‌క్ష‌ల బేస్‌ప్రైజ్‌తో అత‌డు వేలంలోకి రాగా గుజ‌రాత్ టైటాన్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరులు అత‌డి కోసం పోటీప‌డ్డాయి. చివ‌ర‌కు ఆర్‌సీబీ అత‌డిని రూ.5కోట్ల‌కు సొంతం చేసుకుంది.

కుమార్ కుశాగ్రాకు రూ.7.20 కోట్లు..
అన్‌క్యాప్‌డ్ వికెట్ కీప‌ర్ కుమార్ కుశాగ్రా పంట‌పండింది. రూ.20ల‌క్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి రాగా ప్రాంఛైజీలు అత‌డి కోసం పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు అత‌డిని ఢిల్లీ క్యాపిట‌ల్స్ రూ.7.20 కోట్ల‌కు సొంతం చేసుకుంది.

రికీ భుయ్‌ని ద‌క్కించుకున్న ఢిల్లీ..
రూ.20ల‌క్ష‌ల బేస్‌ప్రైజ్‌తో రికీ భుయ్ వేలంలోకి రాగా అదే ధ‌ర‌కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ అత‌డిని ద‌క్కించుకుంది.

టామ్ కోహ్లర్ కాడ్మోర్‌ను కొనుగోలు చేసిన రాజ‌స్థాన్‌..
అన్‌క్యాప్‌డ్ వికెట్ కీప‌ర్ టామ్ కోహ్లర్ కాడ్మోర్ రూ.40ల‌క్ష‌ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి రాగా.. అదే ధ‌ర‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అత‌డిని సొంతం చేసుకుంది.

ర‌మ‌ణ్‌దీప్ సింగ్‌ను సొంతం చేసుకున్న కోల్‌క‌తా..
రూ.20ల‌క్ష‌ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి అడుగుపెట్టిన ర‌మ‌ణ్‌దీప్ సింగ్‌ను అదే ధ‌రకు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ద‌క్కించుకుంది.

షారుఖ్‌ఖాన్‌కు రూ.7.4 కోట్లు..
హార్ట్‌హిట్ట‌ర్ షారుఖ్ ఖాన్ పంట పండింది. రూ.40ల‌క్ష‌ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి రాగా అత‌డి కోసం గుజ‌రాత్ టైటాన్స్‌, పంజాబ్ కింగ్స్ లు తీవ్రంగా పోటీ ప‌డ్డాయి. చివ‌రకు అత‌డిని గుజ‌రాత్ టైటాన్స్ రూ.7.4 కోట్ల‌కు ద‌క్కించుకుంది.

అర్షిన్ కుల‌క‌ర్ణి ల‌క్నో సొంతం..
రూ.20ల‌క్ష‌ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి అడుగుపెట్టిన అర్షిన్ కుల‌క‌ర్ణిని అదే ధ‌ర వ‌ద్ద ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.

అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్ రిజ్వికి రూ.8.4 కోట్లు..
అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్ రిజ్వి పంట పండింది. రూ.20ల‌క్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి అడుగుపెట్టిన అత‌డి కోసం గుజ‌రాత్ టైటాన్స్ , చెన్నై సూప‌ర్ కింగ్స్‌లు పోటీప‌డ్డాయి. చివ‌రికి అత‌డిని రూ.8.4 కోట్ల‌కు చెన్నై సొంతం చేసుకుంది.

అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర్‌ శుభ‌మ్ దూబెకు రూ.5.8 కోట్లు..
అన్‌క్యాప్‌డ్ ప్లేయ‌ర‌ల్ శుభ‌మ్ దూబెకు అదృష్టం వ‌రించింది. రూ.20ల‌క్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి అడుగుపెట్టిన అత‌డి కోసం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పోటీ ప‌డ్డాయి. ఆఖ‌ర‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ.5.8 కోట్ల‌కు అత‌డికి ద‌క్కించుకుంది.

దిల్షాన్ మధుశంక ముంబై సొంతం..
శ్రీలంల‌క ఆట‌గాడు దిల్షాన్ మ‌ధుశంక కోసం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, ముంబై ఇండియ‌న్స్ పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు ముంబై అత‌డిని రూ.4.6 కోట్ల‌కు కొనుగోలు చేసింది.

జ‌య‌దేవ్ ఉన్క‌ద‌త్ హైద‌రాబాద్ సొంతం..
రూ.50ల‌క్ష‌ల బేస్ ప్రైస్‌తో భార‌త పేస‌ర్ జ‌య‌దేవ్ ఉన్క‌ద‌త్ వేలంలోకి రాగా అత‌డి కోసం ఢిల్లీ, హైద‌రాబాద్ జ‌ట్లు పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రూ.1.6 కోట్ల‌కు అత‌డిని ద‌క్కించుకుంది.

క‌మిన్స్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన స్టార్క్‌..
రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన మిచెల్ స్టార్క్‌ను రూ. 24.75 కోట్ల‌కు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కొనుగోలు చేసింది. ఈ క్ర‌మంలో స్టార్క్ ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడైన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఇంత‌క‌ముందు ఇదే వేలంలో క‌మిన్స్ ను రూ.20.50 కోట్ల‌కు ఎస్ఆర్‌హెచ్‌ ద‌క్కించుకుంది.

శివ‌మ్ మామీ ల‌క్నో సొంతం..
భార‌త ఆట‌గాడు శివ‌మ్ మామీ కి మంచి ధ‌ర ల‌భించింది. రూ.50ల‌క్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన అత‌డితో కోసం ఆర్‌సీబీ, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు రూ.6.40 కోట్ల‌కు ల‌క్నో మావీని సొంతం చేసుకుంది.

ఉమేశ్ యాద‌వ్‌ను రూ.5.80 కోట్ల‌కు ద‌క్కించుకున్న గుజ‌రాత్..
భార‌త సీనియ‌ర్ పేస‌ర్ ఉమేశ్ యాద‌వ్‌కు మంచి ధ‌ర ల‌భించింది. రూ.2కోట్ల బేస్‌ప్రైజ్ తో వేలంలోకి రాగా రూ.5.80 కోట్ల‌కు గుజ‌రాత్ టైటాన్స్ అత‌డికి సొంతం చేసుకుంది.

అల్జారీ జోసెఫ్‌ను రూ.11.50 కోట్ల‌కు కొన్న బెంగ‌ళూరు..
వెస్టిండీస్ పేస‌ర్ అల్జారీ జోసెఫ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. బేస్ ప్రైజ్ కోటితో వేలంలోకి రాగా అత‌డి కోసం మొద‌ట‌గా చెన్నై, ఢిల్లీ లు పోటీ ప‌డ్డాయి. ఆ త‌రువాత ల‌క్నో, బెంగ‌ళూరు లు సైతం పోటీకి వ‌చ్చాయి. ఆఖ‌ర‌కు ల‌క్నో, బెంగ‌ళూరు జోసెఫ్‌ను ద‌క్కించుకునేందుకు హోరాహోరీగా బిడ్‌లు వేశాయి. అయితే ఆఖ‌ర‌కు రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అల్జారీ జోసెఫ్ ను రూ.11.50 కోట్ల‌కు ద‌క్కించుకుంది.

రూ.50ల‌క్ష‌ల‌కే చేత‌న్ స‌కారియా
పేస్ బౌల‌ర్ చేత‌న్ స‌కారియా రూ.50ల‌క్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి రాగా అదే ధ‌ర‌కు అత‌డిని కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కొనుగోలు చేసింది.

కేఎస్ భ‌ర‌త్ ను సొంతం చేసుకున్న కేకేఆర్‌
వికెట్ కీప‌ర్ కేఎస్ భ‌ర‌త్ రూ.50ల‌క్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి రాగా అదే ధ‌ర‌కు అత‌డిని కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ద‌క్కించుకుంది.

ట్రిస్టన్ స్టబ్స్ ఢిల్లీకి..
వికెట్ కీప‌ర్ ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ రూ.50ల‌క్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి రాగా అదే ధ‌ర‌కు అత‌డిని ఢిల్లీ క్యాపిట‌ల్స్ సొంతం చేసుకుంది.

క్రిస్‌వోక్స్‌కు రూ.4.2 కోట్లు
ఇంగ్లాండ్ పేస‌ర్ క్రిస్‌వోక్స్‌కు మంచి ధ‌రే ల‌భించింది. రూ.2కోట్ల బేస్‌ప్రైజ్‌తో అత‌డు వేలంలోకి వ‌చ్చాడు. అత‌డిక కోసం పంజాబ్ కింగ్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు పోటీప‌డ్డాయి. చివ‌ర‌కు పంజాబ్ కింగ్స్ అత‌డిని రూ.4.2కోట్ల‌కు ద‌క్కించుకుంది.

ఆల్‌రౌండ‌ర్ డారిల్ మిచెల్‌కు రూ.14కోట్లు..
న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ డారిల్ మిచెల్ పై క‌న‌కవ‌ర్షం కురిసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చిన అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. ముఖ్యంగా చెన్నై సూప‌ర్ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్ చివ‌రి వ‌ర‌కు పోటీ ప‌డ‌గా రూ.14 కోట్ల‌కు చెన్నై అత‌డికి ద‌క్కించుకుంది.

హ‌ర్ష‌ల్‌ప‌టేల్‌కు రూ.11.75కోట్లు..
భార‌త పేస‌ర్ హ‌ర్ష‌ల్ ప‌టేల్ కు మంచి ధ‌ర ద‌క్కింది. రూ.2కోట్ల బేస్‌ప్రైజ్‌తో అత‌డు వేలంలోకి వ‌చ్చాడు. అత‌డి కోసం గుజ‌రాత్ టైటాన్స్‌, పంజాబ్ కింగ్స్ హోరాహోరీగా పోటీప‌డ్డాయి. చివ‌ర‌కు రూ.11.75 కోట్ల‌కు పంజాబ్ కింగ్స్ అత‌డిని సొంతం చేసుకుంది.

ద‌క్షిణాఫ్రికా పేస‌ర్ గెరాల్డ్ కోయిట్జీ ముంబై సొంతం..
ద‌క్షిణాఫ్రికా పేస‌ర్ గెరాల్డ్ కోయిట్జీ రూ.50ల‌క్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి రాగా.. అత‌డిని కోసం ప్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు అత‌డిని రూ.5 కోట్ల‌కు ముంబై ఇండియ‌న్స్ ద‌క్కించుకుంది.

ఆసీస్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ కు రికార్డు ధ‌ర‌..రూ.20.50కోట్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ సొంతం
అనుకున్న‌ట్లుగానే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ క‌మిన్స్ అత్య‌ధిక ధ‌ర ప‌లికింది. రూ.2కోట్ల ధ‌ర‌తో వేలంలోకి వ‌చ్చిన అత‌డి కోసం ఫ్రాంచైజీలు పోటీప‌డ్డాయి. ధ‌ర పెరిగిపోవ‌డంతో మిగిలిన ఫ్రాంచైజీలు ప‌క్క‌కు త‌ప్పుకున్నా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప‌ట్టు వీడ‌లేదు. చివ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ రూ.20.50కోట్ల‌కు ద‌క్కించుకుంది

అజ్మ‌తుల్లా ఒమ‌ర్జాయ్ గుజ‌రాత్ టైటాన్స్ సొంతం..
అఫ్గానిస్థాన్ ఆట‌గాడు అజ్మ‌తుల్లా ఒమ‌ర్జాయ్ రూ.50 ల‌క్ష‌ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చాడు. అదే ధ‌ర వ‌ద్ద అత‌డిని గుజ‌రాత్ టైటాన్స్ ద‌క్కించుకుంది.

శార్దూల్ ఠాకూర్‌ను కొనుగోలు చేసిన చెన్నై..
భార‌త ఆల్‌రౌండ‌ర్ శార్దూల్ ఠాకూర్ రెండు కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చాడు. అత‌డి కోసం చెన్నై సూప‌ర్ కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు రూ.4కోట్ల‌కు చెన్నై అత‌డిని ద‌క్కించుకుంది.

కివీస్ ఆల్‌రౌండ‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర చెన్నై సొంతం..
న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర బేస్‌ప్రైజ్ రూ.50 ల‌క్ష‌ల‌కు వేలంలోకి రాగా.. అత‌డిని రూ.1.80 కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది.

వ‌నిందు హ‌స‌రంగ‌ను ద‌క్కించుకున్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌..
శ్రీలంక ఆల్‌రౌండ‌ర్ వ‌నింద్ హ‌స‌రంగ రూ.కోటి బేస్ ప్రైజ్‌తో వేలంలోకి అందుబాటులోకి రాగా..రూ.1.50కోట్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ద‌క్కించుకుంది. అత‌డికి కోసం హైద‌రాబాద్ మిన‌హా మిగ‌తా ఫ్రాంచైజీలు ఆస‌క్తి చూప‌లేదు.

ట్రావిస్ హెడ్ రూ.6.80కోట్ల‌కు హైద‌రాబాద్ సొంతం..
వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆస్ట్రేలియా గెలుచుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ఆస్ట్రేలియా ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చాడు. అత‌డిని ద‌క్కించుకునేందుకు చెన్నై, స‌న్‌రైజ‌ర్స్ తీవ్రంగా పోటీప‌డ్డాయి. చివ‌ర‌కు రూ.6.80 కోట్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ద‌క్కించుకుంది.

హ్యారీ బ్రూక్ 4 కోట్లకు ఢిల్లీ సొంతం..
ఇంగ్లాండ్ ఆట‌గాడు హ్యారీ బ్రూక్ రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చాడు. అత‌డిని ద‌క్కించుకునేందుకు రాజ‌స్తాన్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ తీవ్రంగా పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు ఢిల్లీ అత‌డిని రూ.4కోట్ల‌కు సొంతం చేసుకుంది.

వెస్టిండీస్ ఆట‌గాడు రోవ్‌మ‌న్ పావెల్‌ రూ.7 కోట్లకు రాజ‌స్థాన్ సొంతం..
అంద‌రికి కంటే ముందుగా వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ రొమెన్ పావెల్ బేస్ ప్రైజ్ రూ.కోటితో వేలానికి వ‌చ్చాడు. కోల్‌క‌తా, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఇత‌డిని కొనుగోలు చేసేందుకు పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు రాజ‌స్థాన్ రూ.7.40 కోట్ల‌కు ద‌క్కించుకుంది.

స‌ర్వం సిద్ధం..
ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు సంబంధించిన స‌న్నాహ‌కాలు మొద‌ల‌య్యాయి. అందులో భాగంగా మంగ‌ళ‌వారం దుబాయ్ వేదిక‌గా మినీ వేలాన్ని నిర్వ‌హిస్తున్నారు. 10 ప్రాంచైజీల్లో క‌లిపి మొత్తం 77 స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 30 స్లాట్స్ విదేశీ ఆట‌గాళ్ల‌కు సంబంధించిన‌వే. మొత్తం 333 మంది ప్లేయ‌ర్లు మినీ వేలంలో త‌మ అదృష్టాన్ని ప‌రిక్షించుకోనున్నారు. 23 మంది ప్లేయర్లు రూ. 2కోట్ల బేస్ ధరలో, 13 మంది ప్లేయర్లు 1.5కోట్ల బేస్ ధరలో అందుబాటులో ఉన్నారు. పది ఫ్రాంచైజీలు కలిపి రూ. 262.95 కోట్లు వెచ్చించనున్నాయి. కాగా.. వేలానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్ప‌టికే పూర్తి అయ్యాయి. మ‌రికాసేప‌ట్లో వేలం ప్రారంభం కానుంది.