IPL 2025: ఐపీఎల్ విన్నర్ RCB.. ఏడ్చేసిన విరాట్ కోహ్లి..
ఒక సమయంలో ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. గ్రౌండ్ లోనే కంటతడి పెట్టాడు.

Courtesy BCCI @IPL @mufaddal_vohra
IPL 2025: ఐపీఎల్ 2025 విన్నర్ గా ఆర్సీబీ అవతరించింది. ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ పై 6 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఆర్సీబీ కల నెరవేరింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పడింది. కాగా, ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లి బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఒక సమయంలో ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. గ్రౌండ్ లోనే కంటతడి పెట్టాడు.
VIRAT KOHLI STARTED CRYING. 🥹pic.twitter.com/sae7mi3H2u
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 3, 2025
ఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులే చేసింది. ఫలితంగా 6 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్ అనేక మలుపులు తిరిగింది. ఒకసారి ఆర్సీబీ, మరొకసారి పంజాబ్ రేసులోకి వచ్చాయి. చివరికి విజయం ఆర్సీబీనే వరించింది.
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫైనల్ లో విఫలం అయ్యాడు. కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. చివరలో శశాంక్ హాఫ్ సెంచరీతో చెలరేగినా.. ఫలితం లేకపోయింది. పంజాబ్ కి ఓటమి తప్పలేదు.