Harish Rao Protest: హరీశ్ రావు మైక్ కట్.. గొంతు నొక్కుతున్నారంటూ.. సభలో బీఆర్ఎస్ ఆందోళన..
సుంకిశాల, ఎస్ఎల్ బీసీ కూలిపోతే ఎందుకు కమిషన్ వేయరు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీశ్ రావు.

Harish Rao Protest: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు మాటల యుద్ధానికి దిగారు. కాగా, మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సభలో
ఆందోళనకు దిగారు.
స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. మాట్లాడే అవకాశం ఇస్తేనే కూర్చుంటామని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చను ప్రభుత్వం అడ్డుకుంటోందని హరీశ్ రావు ఆరోపించారు. కమిషన్ ముందు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, ఇప్పుడు భలో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని మండిపడ్డారు. మా గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు.
సుంకిశాల, ఎస్ఎల్ బీసీ కూలిపోతే ఎందుకు కమిషన్ వేయరు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీశ్ రావు. 7వ బ్లాక్ మరమ్మతులు చేసి వర్కింగ్ లోకి తెచ్చుకోవచ్చని ఎన్ డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు.
Also Read: నిజాం కంటే శ్రీమంతుడు అవుదామనుకున్నారు.. అందుకే అలా చేశారు.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్