Chandrayaan 3: చంద్రయాన్-3 ఫొటోలు తీసిన చంద్రయాన్-2.. పోస్ట్ చేసి డిలీట్ చేసిన ఇస్రో

ఆ ఆర్బిటర్‌ హై-రిజల్యూషన్ కెమెరా (OHRC)తో కూడి ఉంటుంది. చంద్రుడి చుట్టూ ఇంతటి బెస్ట్..

Chandrayaan 3: చంద్రయాన్-3 ఫొటోలు తీసిన చంద్రయాన్-2.. పోస్ట్ చేసి డిలీట్ చేసిన ఇస్రో

Chandrayaan 3

Updated On : August 25, 2023 / 2:55 PM IST

Chandrayaan 3 -OHRC: చంద్రయాన్-2 ఆర్బిటర్ తీసిన చంద్రయాన్-3 ల్యాండర్ ఫొటోలను ఇస్రో (Isro) తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, ఆ తర్వాత డిలీట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఇప్పటికే చాలా మంది స్క్రీన్ షాట్ తీసిపెట్టుకున్నారు. దీంతో ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ విఫలమైనప్పటికీ ఆర్బిటర్ మాత్రం చంద్రుడిపై తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఆర్బిటర్‌ హై-రిజల్యూషన్ కెమెరా (OHRC)తో కూడి ఉంటుంది. చంద్రుడి చుట్టూ ఇంతటి బెస్ట్ రిజల్యూషన్ ఉన్న కెమెరా ఇదొక్కటే. నీపై.. నా గూఢచర్యం అని చంద్రయాన్-3 ల్యాండర్ ను చంద్రయాన్-2 అంటున్నట్లు ఇస్రో ట్వీట్లో పేర్కొంది.

అయితే, ఆ ట్వీట్ ను ఎందుకు తొలగించిందో తెలియడం లేదు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ ఈ నెల23న చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. చంద్రుడిపై ల్యాండర్ దిగి, రోవర్ ను జార విడిచింది. ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడిపై ప్రయోగాల్లో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్లయింది.

Chandrayaan 3

Chandrayaan 3

Chandrayaan-3: ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి ఎలా దిగిందో మీరూ చూడండి ..